Others

పితృదేవతల ప్రీతి మహాలయ అమావాస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాలయ పక్షం ప్రారంభమయ్యాక 15వ రోజున వచ్చే బాద్రపద బహుళ (లేక కృష్ణ) అమావాస్యే మహాలయ అమావాస్య. శుద్ధ పూర్ణిమనుండి వరుసగా పదిహేను రోజులు పితృపక్షం అంటారు. ఈరోజు నుండీ వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేయాలని పెద్దల మాట. పితృ దోషం అంటే ఒక శాపంగా భావిస్తాం. ఏ వ్యక్తికైనా అనారోగ్యమో లేదా మరే తీరని కష్టాలో కలగడం జరిగితే దానికి కారణం అతడి పూర్వీకులు అంటే ఆ వ్యక్తియొక్క తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రులో తాతముత్తాతలో తెలిసోతెలీకో చేసిన దోషాలు, తప్పులు కారణం కావచ్చు అంటారు. ఇది దూరం చేసుకోవ డానికి శ్రాద్ద కర్మలు చేయడం ఒక పద్ధతి.
గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం,సంతానం కలక్కపోవడం, పుట్టినవారూ బ్రతక్కపోవడం, ఉన్న బిడ్డలూ సరైన తీరులో జీవించకపోడం, వక్రమార్గం పట్టడం వంటివన్నీ కూడా పితృశాపాలుగా చెప్తారు. పితృఋణం తీర్చుకుంటూ ఉంటే ఇటువంటి బాధలనుంచి దూరం కావచ్చు. పితృఋణం తీర్చుకొనే పద్ధతే శ్రాద్దం. తిలతర్పణం వదలటం అంటారు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. దానికి సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం ఆ వంశీకులకు ఉన్నతి కలిగిస్తుంది.
శ్రాద్ధం చేయటంవల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. మనస్ఫూర్తిగా, శ్రద్ధతో శ్రాద్ధకర్మ నిర్వహిస్తే వారు తమ సంతతి వారికి ఆయుష్షు, విద్య, ధనం, సంతానం, సమస్తం కలిగేలాగా దీవిస్తారు. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అంటే. శ్రాద్ధకర్మలో నువ్వులు, గూడమిశ్రీత అంటే బియ్యాన్ని బెల్లంతో కలిపి వండే అన్నం, పితృదేవతలకు అర్పిస్తే ఆ వ్యక్తి సంపద వృద్ధి అవుతుంది.
అమావాస్యనాడు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్థంకన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షంలో చేసేవి. పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్యనాడైనా చేయాలంటారు పెద్దలు.
ధనం సమకూరనప్పుడు, అవకాశం లేనపుడూ శ్రార్ధకర్మలు పద్ధతి ప్రకారం చేయలేనివారు పితృపక్షమైన ఈ మహాలయ అమావాస్యనాడు ఉత్త శాకంతో అంటే ఏదైనా కూరతో శ్రాద్ధం చేయవచ్చు. అదికూడా వీలుకాకపోతే, గోవుకు దాని ఆహారమైన గడ్డి పెట్టవచ్చు. అదీ చేయలేనివారు చేతులెత్తి మొక్కి పితృదేవతలకు నమస్కరించవచ్చు.
1.ఋషి ఋణము, 2. దేవ ఋణము, 3. పితృ ఋణము. ఈ మూడు ఋణాలను తీర్చుకోవాలి. తీర్చుకున్నవారు ఉన్నతిని పొందుతారు అనేది శాస్త్ర వాక్యమే కాక అనుభవజ్ఞులు కూడా ఉన్నతశిఖరాలను అధిరోహించామని చెప్తున్నారు.
అన్ని అమావాస్యలు (సంవత్సరంలో 12సార్లు) సౌరమానం ప్రకారం సంక్రమణ ఆరంభ దినాలు (సంవత్సరంలో 12 సంక్రమణాలు) మరియు గ్రహణాల, మహాలయ పక్షాల వంటి సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అలా వీలుకానిపక్షంలో అమావాస్య తర్పణలు తప్పక చేయాలి. సౌరమానులకు సంక్రమణాలు ప్రధానం. ఆమావాస్య తర్పణాలతో బాటు (ఉత్తరాయణ పుణ్యకాలం మకరం) సంవత్సరంలో మేషం, కర్కాటకం (దక్షిణాయన ఆరంభం కర్కాటకం) తుల, మకర సంక్రమణాలు ఈ నాలుగు నెలల్లోనైనా తప్పక తర్పణం చేయాలి. మహాలయ పక్షాలలో విధిగా తర్పణం చేసి తీరాలి. మనసారా శ్రద్ధ, భక్తితో మన పితృదేవులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలా భావించిచేయాలి. ‘శ్రద్ధ యా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. ఈ తర్పణాలను, పితృకర్మలను నిజాయతీగా శ్రద్ధగా మనసావాచా కర్మణా చేస్తే మంచిది. ఇక్కడ మొక్కుబడికి చేయడం అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. అసలు ఎక్కడా ఆర్భాటం కోసం చేసే ఏ పని కూడా భగవం తుడు మెచ్చడు. మనస్పూర్తిగా చిత్తశుద్ధితో చేసిన చిన్న విషయమైనా భగవంతుని మెప్పు తప్పక ఉంటుంది.

- వాణిమూర్తి