Others

జ్ఞానదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరి వద్ద అధికముగా ఉన్న దానిని అవసరమున్నవారికి ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడమే దానం అనవచ్చు. దానాల్లోకి ఉత్తమమైన దానం ఏదని ఆలోచిస్తే అది జ్ఞానదానమే గొప్ప అని విజ్ఞులు అంటున్నారు. అన్నదానం పుణ్యదానమే. గొప్పదానమే అయినప్పటికీ అన్నమో రామచంద్రా అనే వారికి, ఆకలికి తట్టుకోలేక పోతున్నవారికి అన్నం పెట్టడం అంత గొప్ప కార్యం మరేదీ ఉండదు. కాకపోతే ఈ దానం క్షుద్బాధనుమాత్రమే తీరుస్తుంది. ఈ ఆకలిని మించిన మరో ఆకలియే జ్ఞాన దాహం. జ్ఞానాన్ని ఎంత గ్రోలినా ఇంకా జ్ఞాన భాండాగారంలో తెలియనిది ఇంకా ఉంటూనే ఉంటుంది. ఉత్తమ దానం ఏది అనే ప్రశ్నకు మనుస్మృతి ఇలా బదులు చెప్పింది.
అభిగమ్యోత్తమం దానం
అహూయైవతు మధ్యమం
అధమం యాచమానాయ
సేవాదానంతు నిష్ఫలమ్
పాత్రుడైన వ్యక్తి వద్దకు వెళ్లి ఇచ్చే దానం ఉత్తమం. యోగ్యుని తన వద్దకు రప్పించుకుని ఇచ్చే దానం మధ్యమం. యాచకునికి ఇచ్చే దానం అధమం. సేవ కు ప్రతిఫలంగా ఇచ్చేదానం నిష్ప్రయోజనం. ఇంకా చెప్పాలంటే మన దగ్గర మిగిలిన వస్తువును దానం చేయడం అధమం. మనకోసం దాచుకోకుండా సర్వస్వాన్ని దానం జేయడం మధ్యమం. మన దగ్గర లేకపోయినా సంపాదించి మరీ దానం చేయడం ఉత్తమం. అలాంటి గొప్పవారు మేఘముల వంటివారు. మారద వెంకయ్య కవి ఇలా దానం గురించిన విశేషాలు చెప్పారు.
దానము జేయగోరిన వదాన్యునకీయగ శక్తి లేనిచో
నైన పరోపకారమునకై యొక దిక్కున తెచ్చి యైననీ
బూనును మేఘడంబుధికి పోయి జలంబుల తెచ్చి రుూయడే
వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా!
మేఘుడు సముద్రపు నీరు సేకరించి లోకానికి వర్షం కురిపించినట్లుగా తమ వద్ద లేకున్నా మంచి మనసున్న వారు ఎక్కడినుండైనా సంపాదించి మరీ దానం చేస్తారు.
అయితే అన్ని దానాల్లోనూ ఉత్తమోత్తమైనది జ్ఞానదానం అని భగవద్గీత
వార్యన్నగో మహీవాసస్తిల కాంచన సర్పిషామ్ సర్వేషా మేవ దానానాం జ్ఞానదానం విశిష్యతే॥
దానాలన్నింటిలోనూ జ్ఞాన దానమే గొప్పది. ఎందుకంటే జ్ఞానాన్నివ్వడం కల్పవృక్షాన్ని దానం చేసినంతటి ఫలితాన్నిస్తుంది.
మాతేవ రక్షతి, పితేవ హితే నియుక్తే
కాంతేవ చాభి రమయ త్యపనీయ ఖేదం
లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షుకీర్తిం
కిం కిం నసాధయతి కల్పల తేవ విద్యా జ్ఞానమనేది తల్లిలా కాపాడుతుంది. తండ్రిలా మేలు చేస్తుంది. కాంతలా దుఃఖాన్ని పోగొట్టి ఆనందం కల్గిస్తుంది. అన్ని దిక్కుల్లో కీర్తి ప్రతిష్టలు పెంపొందిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.కల్పవృక్షం లాగా సకల శుభాలను సాధించి పెడుతుంది.
అలాంటి జ్ఞానం లభించాలి. కష్టాల కడలి దాటడానికి నావలా, సమస్యల చీకట్లు పారద్రోలి వెలుగు నిచ్చే దీపంలా, మట్టిని బంగారంగా మార్చే పరసు వేదిలా జ్ఞానం పని చేస్తుంది. జ్ఞాన దానం వల్ల సంపద దానితోబాటు కీర్తి లభిస్తుంది. జ్ఞానం కాకుండా ఇతర దానాలు చేసినపుడు ఒకానొకప్పుడు దానం పుచ్చుకున్న వారి దగ్గర దానం పట్టగా వచ్చిన సంపదనో లేక మరేదైనా కొరత ఏర్పడవచ్చు. కానీ జ్ఞానం దానం తీసుకొన్న వారి వద్ద ఆ జ్ఞానం పెరుగుతుందే కానీ తరిగిపోదు. కనుక జ్ఞాన దానం చేసినవారి పుణ్యమూ పెరుగుతూ ఉంటుం ది. వారి జ్ఞాన రాశి పెరుగుతూనే ఉంటుంది. జ్ఞాన సంపాదనకు బుద్ధి అవసరం. బుద్ధికి‘మనీషా’ అనేది పర్యాయ పదం. బుద్ధిర్మనీషా ధిషణాధీః ప్రజ్ఞా శేముషీ మతిః అంటే మనీష కలవాడు కనుకనే మానవుడిని మనిషి అన్నారు. బుద్ధి అందరిలో ఉన్నప్పటికీ అది నివురు కప్పిన నిప్పులాగా అణిగి ఉంటుంది.
వేల మందిలో ఏ ఒకనికో జ్ఞానం కోసం ప్రయత్నించాలనే కోరిక కలుగుతుంది. అలాప్రయత్నించే వారిలో నూటికో, కోటికో ఒకరికి మాత్రమే జ్ఞాన సిద్ధి కలుగుతుంది. గురువుల పట్ల , శాస్తవ్రాక్యాల పట్ల, ఎవరికి ఎంత శ్రద్ధ ధారణ (అవధారణ) విశ్వాసం ఉంటాయో వారికి అంత మాత్రమే జ్ఞానం లభ్యమవుతుంది. జ్ఞానం కలవారు చిత్త శాంతిని పొందగలుగుతాడు.

గొల్లాపిన్ని సీతారామశాస్ర్తీ 9440781236