Others

ఆజ్ఞాచక్రం సర్వ రక్షాకర చక్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=================================================
శ్లో: హం, క్షం, వర్ణోపాత్త, పత్ర ద్వయాఢ్యం
శంభుస్థానం దోం మయం బుద్ధి తత్త్వం
భ్రూమధ్యస్థం హాకినీవాస మారా
దాజ్ఞాచక్రం భద్రమంతర్థరామి
ఆజ్ఞా చక్రాబ్జ నిలయాశుక్ల వర్ణా షడానన
మజ్జా సంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా
హరిద్రాన్నైక రసికా హాకినీ రూపధారిణీ
సిద్ధమాత హాకిని హం హాకిని స్మృత్యై నమః
- ల.స.నా.107,108 ఈ తల్లిని ప్రార్థించిన వారికి మనోనిశ్చలత, మజ్జ్ధాతు వృద్ధి జరుగుతుంది. హం, క్షం, అను అక్షర బీజములు రెండు దళములయందు గలది. శంభునికి స్థానమైనది. ఓంకార మయమైనది మనస్సు తత్వం కలది. భ్రూమధ్యంలో ఉండి హాకినీ దేవికి నివాసమైనది. మంగళప్రదమైన ఆజ్ఞాచఆకాన్ని మనసులో ధరిస్తున్నాను అని స్తుతించాలి.
మూడవ కన్నుగా పిలవబడుతున్న ఆజ్ఞా చక్రము బుద్ధి (్ధ)శక్తిని, జ్ఞాపకశక్తని పెంపొందిస్తుంది. దీనిని బ్రహ్మలిఖిత గుప్తస్థానమని కూడా అంటారు. ఆజ్ఞా చక్రాబ్జదళ సూచిత శక్తులు, 1. హంసవతీ, 2. క్షమావతి. పిట్యూటరి గ్రంధి రక్త ప్రసరణ వ్యవస్థలను మెదడు యొక్క ముందు భాగము చేయు క్రియలను ఈ ఆజ్ఞాచక్రం నియంత్రిస్తుంది. ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు ప్రధాన నాడులు. ఈ ఛక్రమందు సంగమించి సహస్రారమునకు ప్రవహిస్తాయి. ఈ ఆజ్ఞాచక్రాన్ని గురుశిష్యులకు వారధిగా కూడా పేర్కొంటారు. దేవతలకు గురువైన బృహస్పతి, గురుమండలమునకు అధిపతి, కావున ఆజ్ఞా చక్రమును గురుచక్రమని కూడా వ్యవహరిస్తారు. దీనిస్థానం వెన్నుపూసపై భాగమందలి ౄళజూఖ్ఘ యఇ్ఘశఘఆ్ఘ ఇక్కఢ మాలిన్య విశేషములు శుద్ధి చేయబడి కర్మ క్షయవౌతుంది. ఈ చక్రం సరిగా పనిచేయని ఎడల అసూయ, ద్వేషము, వ్యామోహము, మరియు భ్రమలు కలుగుతాయి. ఈ చక్రమునకు అవరోధములు కలిగించేవేమనగా దుర్వస్యసనములు, అహంకారము, నిద్రలేమిలాంటివి. అవరోధాన్ని తొలిగించేవి, సాధు స్వభావము, నమ్రత మొదలగు లక్షణాలు ఈ చక్రాన్ని ఆంగ్లంలో ఉకళ ఇ్యతీ షళశఆళ అంటారు. ఈచక్రం కనుగగొమ్మలకు మధ్యన, బొట్టు పెట్టుకునే స్థానమునకు వెనుకభాగములో ఉంటుంది. మనశరీరంలో మనకు కనబడని మనస్సు తత్వాన్ని నియంత్రిస్తుంది. ఈ చక్రాధిష్ఠాన దేవత ‘‘సిద్ధమాత’’ ఈమె ఆరుముఖములతో తెల్లని రంగు కలిగి హాకినీ శక్తి రూపంలో ఉండి మన శరీరమందలి సప్త్థాతువులలో ఒకటైన మజ్జ (ఎముకలలోని కొవ్వు) కు అధిదేవతగా ఉంటుంది. ఈ చక్రమందలి వ్యాహృతి ‘‘ఓం తపః’’ నిజానికి ఈ చక్రమొక సూక్ష్మ మానసిక క్షేత్రం.
ఆజ్ఞాచక్రం తదూర్ద్వేతు శుక్లం ద్విదళమండితం
కర్పూర హక్షలసితం , మనో ధిష్ఠిత రంజితమ్ (సమ్మోహన తంత్రం ఆజ్ఞాచక్రంలో ఆరుముఖములతో హాకినీ శక్తి తన చేతుల యందు పుస్తకము అక్షమాల, కపాలము, ఢమరుకము, వరద -అభయ ముద్రలు ధరించి ఉండును. ఇది మనస్తత్వముగల చక్రం. ఈ చక్రంలో శివుడు విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ బీజము ‘ఓం’ కనుక ఇక్కడ ఉపాసన చేయు సాధకుడు జ్ఞానవంతుడు అగుచున్నాడు. సర్వజ్ఞుడై. సర్వతంత్రుడై, సర్వదర్శియై అందరి క్షేమమును కోరువాడౌతాడు.అ తడే ‘‘బ్రహ్మోద్వైతి’’ సృష్టి, స్థితి, లయలనుకూడా చేయగలుగుతారు. ఈ చక్రంలోని త్రికోణమునందు ప్రణవానికి ఆధారమైన ‘అ+ఓ’అక్షరాలుంటాయి. అది శుద్ధి, బుద్ధి, దాని మీద బిందు రూపంలో మకారము ‘మ్’ ఉంటుంది. మన ఆజ్ఞా చక్రంలో ఉంటే అమ్మవారిని ‘‘ఓఢ్యాణ పీఠ నిలయా’అని అంటారు. శ్రీచక్రంలోని పీఠం వద్ద గల త్రిభుజాన్ని కూడా ‘‘ఓఢాణ్య పీఠం’’ అంటారు.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014