Others

ధర్మపరాయణత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషికి కోరికలు బాధ్యతలు ఉంటూ ఉంటాయ. కోరికలు తీర్చుకోవడంలో ఉన్న ఆతురత బాధ్యతలను నెరవేర్చడంలో చాలామందికి ఉండదు. కొందరు ముందు బాధ్యతలు తీర్చుకుని తర్వాత కోరికల గురించి ఆలోచిస్తారు. మరికొందరు కేవలం కోరికలనే ఎట్లా ఫలవంతం చేసుకోవాలో మాత్రమే చూస్తుంటారు. అలాంట పుడే ఇతరులకు సమస్యలు వారి వల్ల కలుగుతుం టాయ. కర్తవ్యనిర్వహణ చేస్తే చాలు బాధ్యతలు వాటికవే నిర్వహించబడుతాయ.
పక్షులు వాటి వాటి పిల్లలకు రెక్కలు వచ్చినంతవరకు పెద్ద పక్షులు కాపాడుతాయ. ఒక్కసారి రెక్కలు వచ్చి ఎగురగల శక్తి వచ్చినపుడు వాటి బాధ్యత అయపోయనట్టుగాభావించి వాటిని వదిలేస్తాయ. వాటిల్లో పిల్లపక్షులు పైకి ఎదిగి తిరిగి తనను పుట్టించిన వారిని కాపాడాలన్న నియమ మేదీ లేదు. కానీ మనుష్యుల విషయంలో పెద్దలు పిల్లలు వారు ఎదిగి ఒక స్థాయకి వచ్చేదాక పెద్దలు తమ బాధ్యతగా పనులుచేస్తుంటారు. ఆ పెద్దలే వార్ధక్యం వచ్చినపుడు వారు ఇతరులకు కాదుకదా వారికి వారే పనులు చేసుకోలేని స్థితిలోకి వెళ్లి పోతుంటారు. అట్లాంటి ముసలితనంలోనే వారి వారి పిల్లలు పెద్దలుగా బాధ్యత తీసుకొని ముసలి ప్రాణులను కంటికి రెప్పవలె కాపాడుతుంటారు. ఇది ప్రపంచంలో ఉన్న నైజం అనుకోండి. లేదా పిల్లల బాధ్యతను నెరవేరుస్తున్నారు అనుకోండి. కానీ నేడు పెద్దలు అంటే తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులై పిల్లల బాధ్యతను సరిగా చేయలేక ఇతరులకు అప్పగిస్తున్నారు. ఇట్లా పెరిగిన పిల్లలు కూడా సరియైన శిక్షణాభ్యాసాలు లేక వారు పెద్దలను చూడడంలో తప్పటడుగులు వేస్తున్నారు. దానివల్ల ఎన్నో వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయ. సరియైన ధర్మం పట్ల అవగాహన లేక ఎన్నో భ్రూణహత్యలు జరుగుతున్నాయ. మరెందరో పుట్టిన పిల్లలను చెత్తకుప్పల్లో వదిలేస్తున్నారు. వారు పుట్టి పుట్టగానే వారిని మృత్యు కుహూరంలోకి నిర్దాక్షణ్యంగా పంపించేస్తున్నారు.
వీటిఅన్నింటికీ కారణం ధర్మం సత్యం పట్ల నిష్ట లేకపోవడం వాటిని అర్థత చేసుకోలేక పోవడమే కనుక ఇపుడైన ధర్మాన్ని గురించి ఆలోచించాలి. సత్యాన్ని సదా పలుకుతుండాలి. అపుడు మాత్రమే మనిషికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేశక్తియుక్తులు కలుగు తాయ. సత్యధర్మాలకు దూరమైతే తాను ఒంటరి నన్న భావన ఏర్పర్చుకుని తన ఆవేదనలు పంచుకోవడానికి ఎవరూ లేరన్న అపోహతో చావుకు కూడా సిద్ధపడుతుంటారు. ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనిషి ఎపుడు అంతరాత్మ చెప్పినట్టు వినాలి. అంతరాత్మ చెప్పినా వినకుండా చెడుపనులు చేసినపుడు ఒంటరి వాడు అయపోతాడు. ఇలా ఒంటరి కాకుండా ఉండాల న్నా, బాధ్యత గల పౌరుడిగా మసలుకోవాలన్నా కూడా గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు వినాలి. కృష్ణుడు నీవు నీ కోర్కెలను అదుపులో ఉంచుకున్నట్లు అయితే నీవు సుఖపడగలవు. నీవు చేసే ప్రతి పనిలో స్వార్థం మాని స్వలాభం కొంత మానుకుని ఆ పనిఫలితము కేవలం నీ ఒక్కనికే కాక నలుగురికీ ఉపయోగంగా ఉండాలని చేస్తే అది నీకు మంచి యశస్సును కలుగచేస్తుంది అని చెప్పాడు. కర్తవ్య నిర్వహణ సరిగా చేయాలంటే ముందు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అపుడే కోరికల నియంత్రణ జరుగుతుంది. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం అనుకొంటే ముందు భగవంతుని పై బుద్ధి నిలిపితే ఆ దైవం పట్ల ఆసక్తిని ఏర్పరుచుకుంటే భక్తి ఏర్పడుతుంది. భక్తి వలన మనుష్యులందరూ సమానమనే భావన కలుగుతుంది.
పరుల్లో పరమాత్మ అంశం ఉందన్న దృఢనిశ్చయభావనతో దీనజనోద్ధరణకు నడుం కడ్తారు. అదే మానవ సేవగా పరిణమిస్తుంది. మానవ సేవనే మాధవ సేవగా రూపొందుతుంది. ఆ మానవసేవ మాధవ సేవ రెండూ కలసి సర్వప్రాణి సేవగా మారి ప్రాణికోటి యావత్తు భగవానుని స్వరూపంగా భావించడం సంభవిస్తుంది. త్యాగమే మనిషిగా పుట్టినందుకు జన్మను సార్థక్యం చేస్తుంది. చరిత్రలో కేవలం త్యాగజీవులకు, ధర్మపరాయణులకు మాత్రమే చోటు ఉంటుంది. లేకుంటే చీమలు దోమల్లా పుడుతూ చస్తూ కాలచక్రంలో తిరుగుతూ ఉంటాం. ఎపుడైతే భగవంతుని చింతన చేస్తామో అపుడు భగవంతుని స్వరూపంగా మారిపోతాం.

- చివుకుల రామమోహన్