Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అబలలని యెంచఁ బొరపాటు సబలలనియుఁ
జరిత చెప్పిన సత్యమ్ము మఱచినారా?
వీరనారులు జ్యోతులై వెలుగు సూపఁ
జిమ్మచీకటి గుహలోకిఁ జేరుటేల?
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!
భావం: ఆడవారిని అబలలుగా చిత్రించడం ఎంతైనా పొరపాటు అనే చెప్పవచ్చు. ఆడవారు అబలలు కాదు సబలలను, వీరనారీ మణులను ఎందరినో సాక్ష్యంగా చూపుతూ చరిత్ర చెప్పిన సత్యాన్ని మరచిపోయారా?వీరనారీమణులు జ్యోతులై ప్రకాశిస్తూ ఉంటే అబలలుగా చిత్రించడం అనేది అజ్ఞానం. అజ్ఞానాంధకారం అలముకున్న గుహలోకి వివేకవంతులు చేరరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనా చెప్పు స్వామీ.
తే.గీ. స్వస్థతను మించు సంపద జగతియందు
లేదులే యెందు వెదికిన నేది? రంగు
కాగితాలేవి కాలాన ఁ గలసి రావు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఆరోగ్యమే మహాభాగ్యం దాన్ని మించిన భాగ్య రాశులు ఈ జగతిలో లేవన్నది అక్షరసత్యం. చాలా సందర్భాలలో కరెన్సీనోట్ల రంగు కాగితాలుగా గోచరిస్తాయే తప్ప ఎంతమాత్రం కలసిరావు. మనకోసం పరితపించే మనుష్యులు వారి మంచి మనసులను మించిన డబ్బనేది లేనేలేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! ఈ లోకానికి ప్రబోధించవయ్య స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262