Others

సామాజిక జాగృతి ‘కో జాగరీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమూహం లేదా సమాజాన్ని ఐకమత్యంగా నిలిపేది ఉత్సవము. ఆ ఉత్సవము ఏదైనా కావచ్చు. అలానే ఆ దేశ లేదా ఆ ప్రాంత విశిష్టతను, సంస్కతీసంప్రదాయాలను ఈ శుభకార్యం ద్వారా బయట లోకానికి తెలుస్తుంది. ఇటువంటి ఉత్సవాలు మన దేశంలో చాలనే ఉన్నాయి. ఈ కార్యాలే నేడు మన దేశాన్ని కలిసికట్టుగా ఉంచుతున్నాయనడంలో సందేహం లేదు. అటువంటి ఉత్సవాల్లో కో జాగరీ ఉత్సవం ఒకటి.
కో జాగరీ భవత్యేషా, అమృతత్వ ఫలప్రదా!
కార్తీకే మాసి రాకాయాం, సంఘశక్తి ప్రదీపకా!
కార్తీకమాసం పౌర్ణమిరోజున లేదా కార్తీక మాసంలో కో జాగరీ పర్వదినోత్సవాన్ని ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని, సనాతన రుషి పరంపర స్పష్టం చేస్తోంది. ఇది సమాజ శక్తిని ప్రదీప్తం చేయడమేకాక అమృతఫలాన్నిస్తుందని శాస్తవ్రచనం.ఎవరికైనా పూర్ణిమ రోజున వీలుకాకపోతే చతుర్దశి రోజున కానీ, కార్తీక సోమవారం రోజున కానీ ఈ పండుగను చేసుకొంటారు.
చంద్ర కిరణాలు ప్రసరింపగా బెల్లంతో కలిసిన మధుర క్షీరము/పాయసాన్ని అందరూ ప్రసాదంగా తీసుకోవాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోక్షీరం కఫ, వాత, పిత్త దోషాలను తొలగించి, శాంతిని కలుగజేస్తూ, ఆయుర్ధాయాన్ని వృద్ధి చేస్తుంది. బెల్లం ద్వారా శరీరంలోని సప్తదాతువులకు పుష్ఠిని, శక్తిని కలిగిస్తుంది. పూర్వం క్షీరసాగరం మధనం సమయంలో అమృతం ఉద్భవించింది. దానిని కార్తీక పౌర్ణమి రాత్రి(అమృతకిరణుని) చంద్రుని కిరణాల వెలుగులో అందరికీ పంచారు. ఫలితంగా దేవతలు విజయులైయ్యారు.
ఎలా మొదలయింది?
కో జాగరీ లేదా కోన్ జాగరీ అంటే ఎవరు మేల్కొంటారు? అని అర్థం. కొనే్నళ్ళ కిందట మనదేశంపై విదేశీయులు, ముస్లం మూకలు సంపద కోసం దండయాత్రలు చేసేవారు. దీంతో ఆయా పల్లెల్లో యువకులు వంతుల వారీగా మేల్కొని ఉండేవారు. చీమచిటుక్కుమన్నా అప్రమత్తమయ్యేవారు. ఎవరైనా ముష్కరులు వస్తున్నారంటే వారితో పోరాటం చేసేవారు. ఊరంతా కేకలు వేసి, ఊరిని లేపేవారు. అలా మొదలైంది ఈ కో జాగరీ ఉత్సవం. దీనికి గుర్తుగా పవిత్ర కార్తీక పౌర్ణమి నాడు లేదా ఆ మాసం వెనె్నల వెలుగులో ఆటపాటలతో ఎంతో ఉత్సాహంతో వేడుక జరుపుకొనే ఆనవాయితీ ప్రధానంగా ఉత్తర భారత దేశంలో అధికంగా కనిపిస్తుంది.
సమాజ రక్షణ కోసం అన్ని వర్గాలు జాగరూకులై ఉండాలన్న దివ్య సందేశాన్ని ఇస్తుందీ ఉత్సవం. అయితే, ఈ ఉత్సవాన్ని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా దేశంలో ప్రసిద్ధి చెందిన స్వచ్ఛంద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స్థానిక స్వయంసేవకుల ద్వారా దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇటువంటి ఉత్సవాల వల్ల సమాజంలోని వ్యక్తుల నడుమ పరస్పరం పరిచయం, స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయని, తద్వారా భారతీయ సమాజం బలపడుతుందని ఆ సంఘ్ విశ్వసిస్తోంది.

- గున్న కృష్ణమూర్తి, 6304599218.