Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. బుద్ధిజీవులమై యుండి బురదపాలు
చేయఁ గూడదు మనబుద్ధిఁజేయఁదగిన
కార్యములు సేయఁ బూనిన ఖ్యాతిఁ గాంచి
ధన్యజీవుల వౌదుమీ ధరణియందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: బుద్ధి జీవులమైన మనం మన బుద్ధి బురదపాలు చేయరాదని, చేయదగిన పనులు చేసినట్లయితే అకర్మలకు పూనుకోకుండా సకర్మలకు పాటుపడాలనుకొను కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్య స్వామీ!
తే.గీ. కండబలముతో ఁ బాటుగా గుండెబలము
గలిగియుండిఁ బరహిత కార్యములనుఁ
జక్కదిద్దంగ వలయును శక్తిదెలిపి
చూడుమో కర్మసాక్షఇ! యో సూర్యదేవ!

భావం: కండబలాన్ని, గుండెబలాన్ని కలుగియుండి పరహిత కార్యాలను మనమంతా చక్కదిద్దాలని అందుకు మనలోని శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించాలనీ మానవసేవే మాధవసేవ అనే సత్యాన్ని గ్రహించాలనీ కర్మసాక్షి వైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్యా స్వామి!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262