Others

సుభాషితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిశంకరాచార్య విరచితం జగన్నాధాష్టకం
కదాచిత్కాళింది తటవిపిన సంగీత కపరో
ముదాగోపీ నారి వదన కలమాస్వాదమధుప
రామాశంభుబ్రహ్మ మరపతి గనే షార్చితపదో
జగన్నాథః స్వామి నయన పథగాలి భవతుమే
నవైప్రార్థ్యమ్ రాజ్యం న చ కనకితామ్ భోగ విభవం
నయాచే హం రమ్యాం నిఖిల జనకామ్యామ్ వరవధూమ్
సదా కాలేకాలే ప్రథమ పతినా చిత చరితో
జగన్నాథః స్వామి నయన పథగామి భవతు మే
హరత్వం సంసారం దృతతర మసారం సురపతే
హరత్వం పాపానామ్ వితతి మపరామ్ యాదవ పతే
అహో దీనానాథం నిహిత మచలం నిశ్చితాపదం
జగన్నాథః స్వామి నయనపథగామి భవతుమే
భావం: జగన్నాథుడు కాళింది (యమున) నది ఒడ్డున ఉన్న ఉపవనాలలో మృదుమధుర ధ్వనులతో వేణువు ఊదుతూ తిరుగుతుంటాడు. ఆయన తుమ్మెద లాగా కమలముల వంటి వదనములు కలిగిన గోపికల మకరందమును ఆస్వాదిస్తూ ఆనందం అనుభవిస్తున్నాడు. భగవత్స్వరూపులైన లక్ష్మీదేవి, ఇంద్రుడు, శివుడు, బ్రహ్మ, గణేశుడు మొదలగువారు ఆయన పాదపద్మములకు ప్రణమిల్లుతారు. అటువంటి జగన్నాథుడు నా కనులలో దర్శనం ఇస్తుండాలి. నేను రాజ్యం కోసం, బంగారం కోసం, నిధుల కోసం, రూపవతి ఐన భార్య కోసం ప్రార్థించడం లేదు. ఏ జగన్నాథుని కీర్తి ఇవుడు యుగయుగాలుగా స్తోత్రం చేస్తూ ఉంటాడో ఆ జగన్నాథుని నా కన్నులలో ఎల్లపుడు నివసింపమని ప్రార్థిస్తున్నాను. ఈ అనంతమైన పాపముల రాశిని నాశనం చేయి. నమ్రతతో ఉన్నవారికి నిస్సహాయులకు జగన్నాథుని ఆశీర్వాదం ఎల్లపుడు ఉంటుంది. ఆ జగన్నాథుని కనుసన్నులలో నేను సదా ఉండాలి. అని జగన్నాథాష్టకం చదివిన వారికి ఆపదలు నశిస్తాయ. జగన్నాథుడు అన్ని వేళలలా సర్వసన్నధుడై ఉండి తన భక్తులను కాపాడుకుంటాడు. రోజుకొక్కసారైనా ఈ అష్టకాన్ని చదవడానికి అందరూ ప్రయత్నించాలి.