Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. లేమితో బాధపడువారికేమి యిడిన
నదియు పదింతలై వచ్చు నడచుకొనుచుఁ
జేయఁదగు సహాయముఁ జేయఁ బతికి పోరు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దారిద్య్రంతో బాధపడేవారికి ఏమిచ్చినా అది పదింతలై నడచుకుంటూ తిరిగి మన వద్దకు వస్తుంది.పేదవారికి చేయదగు సహాయం చేసినంత మాత్రాన ఆర్థికంగా చితికిపోరన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించవయ్యా స్వామీ.
తే.గీ. చిత్త శుద్ధిలేకున్ననుఁ జేయు పనులు
సత్ఫలితములు గనఁ బోవు శంకయేల
బ్రతుకుగతిఁ దప్పునదిలేక బహు విధాల
జూడుమా కర్మసాక్షి! యోసూర్యదేవ!

భావం: చిత్తశుద్ధి లేకుండా చేసే పనులేవైనా సత్ఫలితాలను ఇవ్వవు. ఈ విషయంలో అనుమానం దేనికిః ఆ చిత్తశుద్ధే లేకుంటే బ్రతుకు అనేక విధఆలుగా గతి తప్పిపోతుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించవయ్య స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262