Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పెద్దవారల మాటలు చల్దిమూట
లవియు విస్మరించిన వారి కవిరళమగు
కష్టనష్టాలు చుట్టీయుఁ గాన వినగ
వలయునెల్లరు సుఖములఁ బడయ వలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పెద్దల మాట చద్దిమూట అని కదా అంటారు. వారి అనుభవసారాన్ని అంతా ఇంతాకాదు. వారు చెప్పేమాటలను శ్రద్ధాసక్తులతో కష్టనష్టాలు చుట్టేస్తాయి. అందుకే పెద్దల మాటలు పెడచెవిన పెట్టరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్యా స్వామి.
తే.గీ. మెట్లనెన్నడు దలుపరు మేడపైకి
నెక్కి నిక్కెదరది తప్పు నీచమెన్నఁ
జూపవలెఁ గృతజ్ఞత ధర్మసూక్ష్మమదియుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మేడపైకెక్కి తల ఎగరేయడం కాదు. మనం ఆ మేడ ఎక్కడానికి తోడ్పడిన మెట్లను తలచుకోవాలి. ఉన్నత స్థానాన్ని చేరుకున్నామని గర్వించడం తగదు. ఆ స్థానానికి చేరుకోవడానికి సహకరించిన వారిని తలచుకుని కృతజ్ఞతాభావాన్ని కల్గియుండడమే అత్యంత ధర్మబద్ధమని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! ప్రబోధించవయ్యా స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262