Others

శరీరమూ ముఖ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజుర్వేదంలో ‘ఇయం తే యజ్ఞియా తనూః’ - ఈ నీ శరీరం యజ్ఞం చేయదగినది అంటే దేహమే లేకపోతే ఏ పనులు చేయగలం? అన్ని పనులకు దేహమే ఆధారం. అందులోను మానవజన్మనెత్తిన వారు వారి జన్మను సార్థకం చేసుకోవాలంటే వారి శరీరమే ముఖ్యమైన వాహిక. ఆరోగ్యకరమైన సుఖకరమైన శరీరం ఉంటేనే ధర్మకార్యాలు చకచకా చేయగలం. ఇంద్రియాలు అన్నీ సక్రమంగా పనిచేస్తే నే ఇతరులకు హితాన్ని ఒనరించగలము. ముఖంలో ఉన్నటువంటి కన్ను ముక్కు, ఛెవులు, నోటిద్వారా విషయాలు చూడడం, వినడం గ్రహించగలగడం లాంటివి చేయవచ్చు. వాటిని మనసులోకి గ్రహించి అక్కడ ఉన్న బుద్ధి ద్వారా వివేచించి వివేకపూరితమైన పనులు చేయవచ్చు. దానికి శరీరంలో ఉంటే సూక్ష్మ, స్థూల అవయవాలన్నీ కలసిపని చేస్తాయ. అపుడు ఇతరులకుకానీ, తనకు కానీ అనుకొన్న కార్యాన్ని సఫలం చేసుకోవచ్చు. అట్లాకాక ఈ శరీరంలో ఏ భాగమైనా అనారోగ్యానికి గురైతే దడానివల్ల మొత్తం శరీరం మూలబడవచ్చు. అపుడు అనుకొన్న కార్యక్రమాలేమీ చేయలేకపోవచ్చు. అందుకే పెద్దలు ముందు స్వలాభాన్ని చూడమన్నారు. కానీ ఆ స్వలాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడమని చెప్పారు. అంతేకాని అంతా నా నా అనమని చెప్పలేదు. దానం చేయడం, సహాయం చేయడం లాంటివి చేసినపుడే ఈ శరీరానికి జీవితానికి పరమార్థం లభ్యమవుతుంది. శ్రేయోదాయకమైన సృష్టి నియమాలను మానవుడెప్పుడు ఆకళింపు చేసుకొం టాడో అపుడు జ్ఞానులంతా అతనిని స్తుతిస్తారు. ఉచితానుచితాలను, మంచి చెడులను గుర్తించి తద్వారా తాను శ్రేయస్సును పొందుతూ ఇతరులకు కూడా శ్రేయస్సును కలిగించడానికి ముఖ్యం గా శరీరమే అవసరం కనుక పెద్దలైనా, వేదమైనా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పింది. అందుకే శరీరంలోని చైతన్యమే భగవంతుడు అనిఅనడంలో పరమాత్మను పట్ల జాగ్రత్త వహించినట్టే శరీరం పట్ల కూడా జాగ్రత్త వహించు.
*