Others

సూర్యశతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మాటి మాటికి గొడవలు మాని గీము
లందు నా నంద ముప్పొంగ రమ్యమైన
జీవితాలను గడుపంగఁ జేరుసుఖము
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: చీటికీ మాటికీ అనవసరమైన విషయాలను పరిగణనలోనికి తీసుకొని గొడవలు పడుతుండడం మానుకోవాలి. మాటపట్టింపులకు పోక అందరితోను కలుపుగోలుగా ఉంటే వచ్చే ఆనందంతో పొంగిపొరలేలా అందమైన జీవితాలను గడిపిన పక్షంలో సుఖమనేది వచ్చి చేరుతుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియజేయుమయ్య ప్రభూ!
తే.గీ. గుండెలందునఁ బ్రేమలు నిండుకున్నఁ
బొంగి పొరలును సౌఖ్యాలు బుడమి తల్లి
తనదు సంతతి నింగని తనివిఁ జెందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మన గుండెల్లో ప్రేమలు నిండుగాఉన్న పక్షంలో సుఖాలు పొంగిపొర్లుతాయి. అపుడు పుడమితల్లి సుఖసంతోషాలతో మునిగి తేలుతున్న తన సంతానాన్ని చూసి ఆనందిస్తూ ఎంతో తృప్తి చెందుతుందన్న వాస్తవాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్యా ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262