Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఎల్లరకు రక్షకుడు దేవుడెల్లవేళ
లందు దేవుని స్మరియింప రమ్యమైన
జీవనంబులు దొరకును జీవులకునుఁ
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం:- ఆ దేవుడే అందరినీ రక్షించేవాడు. సర్వవేళల సర్వావస్థలలోను భగవన్నామ స్మరణ చేసినట్లయితే మానవాళికి మనోహరమైన బ్రతుకులు లభిస్తాయనే సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియుజేయుమయ్యా!

తే.గీ. పుస్తకాలనుఁ జదువంగ బుద్ధిబలము
బెరిగి సమసమాజమునకు విస్తృతముగఁ
దోడుపడునంచు నెఱుగుమీనాడు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: గ్రంథ పఠనం వల్ల బుద్ధి బలం పెరుగుతుంది. ఆ పెరిగిన బుద్ధిబలం నవసమాజ సమసమాజోద్ధరణకు ఎంతగానో తోడ్పడుతుందని కలియుగ మానవులకు నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందనే అనిపిస్తోంది నేడుకూడా. ఆ పనిని నీవే చేయుమయ్యా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262