Others

యథార్థ స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆండాళ్ తల్లి తన చెలులతో కలసి నందగోపుని పూజించడానికి తయారైంది. అదిగో ఆ చెలులందరికీ ఆ యశోదమ్మ బాలసింహం ఎంతగొప్పవాడో చెబుతోంది. చూశారా! గోపవనితలారా! నాడుపురుషోత్తముడు వటువై వచ్చి పెరిగి లోకాలను గెలిచినట్లుగానే ఈనాడు మనం ఆచరించే వ్రతాన్ని చూసి సంతసం పొంది ఈతి బాధలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు కురిసేట్టు చేస్తాడు. ఈ వ్రతాచరణ వల్ల లోకంలో పాడపంటలు సమృద్ధిగా నిండుతాయి పెరిగిన పెద్ద వరిచేలలో చేపలు త్రుళ్లిపడుతూ ఉంటాయి. పూచిన కలువపూవులో అందమైన తుమ్మెదలు నిద్రిస్తూ ఉంటాయి. జంకకుండా కొట్టంలో ప్రవేశించి కూర్చుండి బలిసి యున్న పొదుగును పాలుపిండాలనే ఉద్దేశంతో పట్టీపట్టగనే కుండలకొద్దీ పాలను స్రవిస్తాయి. ఇవి ఉదారములగు ఆవులు. వీటివల్లదేశమంతా సంపద నిండి ఉంటుంది. కనుక మనమందరూ గోసేవ చేస్తూ గోసంపదను అభివృద్ధి చేయవలసి ఉంది.
బలిచక్రవర్తిని వటువు మూడు అడుగులు కోరాడు. బలి ఆ మూడడుగులను ఇవ్వడానికి అంగీకరించగానే వామనుడు తివిక్రముడైనాడు. మూడు రహస్యములను తెలుసుకొనుటకు శిష్యుడు వచ్చినపుడు ఆచార్యుడు తన యథార్థ స్వరూపమును ప్రదర్శిస్తాడు. అనగా పరమాత్మ జీవుడను విత్తనమును ఈ శరీరమను క్షేత్రమున నాటును. ఈ ఆత్మసస్యము ఫలించుటకు ఈతిబాధలులేకుండా చేయవలయును. ఈతిబాధలు లోకమున అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, దుష్టులగు రాజులు అనే ఆరుగురు ఉంటారు. వీరినుంచి ఆత్మఅనేసస్యాన్ని రక్షించుకోవలెను. అట్లే ఆత్మ విషయమున ఈతి బాధలు ఏవంటే దేహాత్మ బుద్ధి, నేను స్వతంత్రుడను బుద్ధి, పరమాత్మ అని కాక ఇతరులకు చెందినవాడను అను బుద్ధి, తనను తాను రక్షించుకొనగలను అనుకొనే బుద్ధి, శరీరబంధువులే నిజబంధువులనుకొను బుద్ధి, శబ్దాది విషయములను అనుభవింపవలయునని బుద్ధి అనేవి ఉంటాయి. ఇక మూడు వానలు ... 1.పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాడనుగాను అనే బుద్ధి, 2. పరమాత్మయే తప్ప ఇతరమగునది ఉపాయము కాదు అనుబుద్ధి, మూడవది పరమాత్మానుభవము తప్ప ఇతరమగునది నాకు రుచింపదు అను బుద్ధి ఈ మూడు వానలు సమృద్ధిగా పడినట్లయితే శరీరంలోని ఆత్మ ఫలవంతం అగును. అంటే భగవంతుని సన్నిధానమునకు వేగంగా వెళ్లగలదు. క్షేత్రమనగా శరీరము. క్షేత్రములో అడుగున జలమనగా పరమాత్మ. చేపలనగా భవద్ధ్యానముతో మాత్రమే జీవించగలుగు భక్తులు. ఈనీటిలో కలువ పూలనగా జీవుల హృదయములు. అందులోని తుమ్మెదలు అనగా లక్ష్మీనారాయణులు.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899