Others

ఆచార్యుని బోధ.. శిష్యునికి సుధామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై పాశురాలను పాడుటకు బయలుదేరిన వారికి ఆండాళ్ తల్లి ఇలా చెబుతోంది. ప్రకృతే పరమాత్మ. ప్రకృతిని రక్షిస్తూ ఎల్లపుడూ సస్యశ్యామలంగా ఉండడానికి సకాలంలో వర్షాలు కురుసేట్టు చేసే వరుణదేవుణ్ణి ఆండాల్ తల్లి ప్రార్థిద్దాం రమ్మని అందరినీ పిలిచి వారితో కలసి ఇలా ప్రార్థిస్తోంది. గంభీరమైన స్వభావం కల్గి వర్షాధిదేవతవైన ఓ పర్జన్యుడా! నీవు వెనుకంజవేయబోయకుము. గంభీరమైన సముద్రముయొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటి నంతటినీ గ్రహించి గోపనందునుని శరీరంవంటి ఛాయను తెచ్చుకుని నీలశరీరులై పద్మనాభుని వంటి దక్షిణహస్తమందలి శ్రీసుదర్శన చక్రమువలె తళుకు బెళుకుమని మెరసియు, వామహస్తమునందలి పాంచజన్యశంఖము వలెను, లోకములన్నియూ అదురు రీతిని ఉరమవలయును. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీశార్‌ఙ్గమనెడి ధనుస్సుచే విడువబడిన శర వర్షమను రీతిన లోకములన్నియు సుఖమునొందుటుల అంతటనూ వర్షించును. ఇపుడు ఈమార్గశీర్ష వ్రతస్నానమును ముదమార చేయుదము రండి.
అనన్య భక్తితో పరమాత్మ నాశ్రయించిన వాని వద్ద దేవతలందరూ ఆజ్ఞావశవర్తులై వచ్చారు. గోపికలందరూ ఉత్తముడైన నారాయణుని నామాన్ని పాడుతూ పర్యర్జునునకు ఏవిధంగా వర్షించాలో చెబుతున్నారు. గంభీరస్వభావం కలిగిన ఓ వర్షనిర్వాహకుడా! పర్జన్యదేవా! నీవు ఔదార్యంలో సంకోచం నేమాత్రం చూపకుము. గంభీర సముద్రమధ్యానికి వెళ్లి ఈ సముద్ర జలాలనంతా గ్రహించి , గర్జించి ఆకాశమంతా వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహమువలె శ్యామలమూర్తివై అతని దక్షిణ బాహువులో ఉండే చక్రమువలె మెరిసి, ఎడమచేతిలోని శంఖమువలె ఉరిమి శార్‌ఙ్గం వలె బాణవర్షమువంటి నీటిధారలను కురిపించుము అని చెబుతున్న ఆండాళ్ తల్లి ఉద్దేశం ఏమంటే ...్భగవంతునికంటె మిన్నయైన ఆచార్యుని కారుణ్యం అధికం. మేఘం సముద్రంలోని ఉప్పునీరును త్రాగి మధురజలములను లోకమున వర్షించును. ఆచార్యులు దురవగాహములగు శ్రుతి సాగర జలములను త్రావి వాటిని సులభశైలిలో బోధిస్తారుగదా. ఆచార్యునకు జ్ఞానమే కాక తెలిసినది ఆచరించుటే మెరుపు. శంఖం వంటి ధ్వని అంటే ఆచార్యుడు చేయు వేదఘోష. మేఘం వర్షించునట్లుగా ఆచార్యుడు భగవద్గుణానుభవమును వర్షించును.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899