Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. మగువలార! మన కృష్ణుడు
మధురాపురి నాయకుండు,
మనమనసులు దోచినట్టి
మహిమాన్విత మర్మజ్ఞుడు

2. యదువంశమునందు బుట్టి
యశోదమ్మ నందనుడిగ;
యమునతటి క్రీడించెను
అందాలను చిందించుచు

3. శుభకరుండు బలవంతుడు
అభయమొసగు విభవ యశుడు;
మాయా మహిమల నెరిగిన
మహనీయుడు మన కన్నడు.

4. అమలాంగనలార! రండి
విమల సుమము లర్పింతము,
ఘనసన్నుతివిని శ్రీహరి
మననోమును పండించును.

5. దామోదరు వ్రతము సలుప
దక్కు మనకు పుణ్యఫలము,
గతప్రస్తుత భవా మనదు
పాతకములు క్షాళనమగు,

6. త్రికరణముల శుద్ధితోడ
దివ్యుని యర్చించినంత
గోవిందుడు వీడదెపుడు
గోపమ్మల ఆశ్రయాన్ని

ఇంకా ఉంది