Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. పక్షులెన్నొ శ్రావ్యముగా
పలు భంగుల కూయుచుండె;
ఖగపతియును కోవెలలో
మంగళాలు పాడదొడగె

2. ఆలయ అర్చకులంతట
అర్చనాది విధులొనర్ప;
జేగంటలు గుడియందున
జయనాదములొనరించెను

3. యోగనిద్రయందు జోగు
జగమేలెడి భగవానుని
మంగళర నామాలతో
మహామహులు కీర్తించిరి

4. పూతన అందించినవిష
పూరిత స్తన్యమ్ము ద్రావి
దాని దునుమాడెను హరి
దమనుండై కేళిగాను

5. సరగున తన బాల్యమందె
శకటాసురుఁ బరిమార్చిన
చిట్టి కృష్ణ పెరుమాళ్ళకు
చేతులెత్తి మ్రొక్కుదాము

6. నిదురలేచి రావె యంచు
గోదబిలిచె నొక వ్రేతను;
ఆమెయు తన మత్తువీడి
అరిగెను శ్రీగోదవెంట.

ఇంకా ఉంది