Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఓటమన్నది గెలుపుకు బాట యంచుఁ
దెలుసుకొనవలె దిగులేల? తివిరి యడుగు
ముందునకు వేయ గెల్పెవ రెందునైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అనేక సందర్భాలలో గెలుపుఓటములు సహజంగా ఉంటాయి. ఓటమి అన్నది గెలుపుకు బాట అనిగ్రహించాలే కానీ ఏమాత్రం దిగులు పడకూడదు. ప్రయత్నపూర్వకంగా ముందడుగు వేస్తే ఒక్కరోజు తప్పక గెలిచి తీరుతారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ ఈ లోకానికి తెలియుజేయుము.
తే.గీ. మూర్ఖులనుఁ జేరి హితబోధ మొదలుపెట్ట
నర్థరహితంబనర్థ దాయకము గాన
వారిదరి ఁ జేర ఁ బోకున్న బాగు బాగు
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మూర్ఖుల చెంతకు జేరి హితబోధ చేయడంలో అర్ధం లేదు. పైగా అలా హితబోధ చేయడంలోఅనర్థదాయకం అవుతుంది. మూర్ఖుల వద్దకు పోకుండా ఉండడం అన్నివిధాల మేలన్నసత్యాన్ని కర్మసాక్షివైన ఓసూర్యదేవా నీవైనా ఈ లోకానికి తెలియుజేయుము ప్రభాకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262