Others

తమోగుణాన్ని వీడు సత్వగుణాన్ని చేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీచు కీచుమనే శబ్దాలతో భరద్వాజ పక్షులన్నీ కూడా బాలభానుడికి సుప్రభాతం పలుకుతున్నాయి. తూర్పు తెల్లవారబోతుంటే కూడా ఇంకా నిద్ర లేవని నిన్ను పిచ్చిపిల్లా! అని సంబోధించాలనిపిస్తోంది. తలలోని పూవులు జారిపోతున్నాయి. గోపకాంతలందరూ లేచి పెరుగును చిలుకుతున్నారు. మనమూ వెళ్లి ఆ నందగోపుని అర్చిద్దాం రమ్మని ఆండాళ్ తల్లి పిలుస్తోంది. అంటే భారద్వాజ పక్షుల పలుకులనగా శ్రోత్రియులగు బాహ్మణులు తెల్లవారుజామున చేసేవేదాధ్యయనం. శిష్యుల సందేహాలకు గురువుల సమాధానాలతో పక్షుల కిలకిలరావాల్లా వినిపిస్తున్నాయి. రాత్రిని తమోగుణంగా భావిస్తే పగలు సత్వగుణంగా భావించవచ్చు. పెరుగు చిలకటం అనేది క్షీరసాగర మధనం. ఇక్కడ సముద్రమే భగవానుడు. పాలు భగవత్స్వరూప రూపగుణ విభూతులు. మధించుట అనగా మననం చేయడం. భగవానుని పై నిలిపిన బుద్ధియే మందరం. శ్రద్ధయే వాసుకి. భగవత్కటాక్షమే అమృతం. గోవులనగా వాక్కులు, వేదములు. వాని వల్ల వచ్చే పాలు భగవద్గుణాలు. కనుక మీరంతా పొద్దుటే నిద్రలేచి తమస్సును వీడి అన్ని పదార్థాలల్లో అంతరాత్మయై ఉండికూడా వాటికి కనిపించకుండా వాటిని నిలుపుతూ ఉన్న ఆ భగవంతుడు పరమాత్మ నేడు పామరులకు కూడా చర్మ చక్షువులతో చూడడానికి వీలుగా రూపం దాల్చిన సులభుడు. యశోదా నందనుడు. తనను ఆశ్రయించిన మన విరోధులను తన శ్రమను కూడా లెక్కించక హింసించు కరుణామయుడగు కేశవుని (కేశి అనే రాక్షసుని సంహరించినవాడైన శ్రీకృష్ణుడు) కీర్తిస్తూ ఉంటే విని కూడా ఇంకా పరుండియే ఉంటావా... మాకందర కున్నూ నీవు నాయకు రాలవు కదా. ఇక లెమ్ము సమస్త వస్తుసముదా యమునకు బాహ్యాంతరములందు వ్యాపించిన తత్త్వము మనకు కొరకు శ్రీకృష్ణునిగా వచ్చికేశి అనే మన విరోధులను సంహారమొన ర్చిన ఆ దేవదేవుని, ఆ తేజశ్శాలిని పరమాత్మను చూద్దాం రమ్మని ఆ తల్లి పిలువగా తమోగుణంతో ఉన్న ఆ గోపకాంత ఒక్కసారిగా తమోగుణాన్ని పారద్రోలి కృష్ణుని చూడడానికి తన్ను పిలవడానికి వచ్చిన ఆండాళ్ తల్లితో బయలుదేరింది. మనమూ ఆ తల్లి పాశురాలను సమూహికంగా అనుసంధించడానికి కోవెలకు వెళ్దాం రండి. ఇక్కడ గురుపరంపరలో అస్పత్పరమగురుభ్యోనమః అనువాక్యాన్ని అనుసంధానించుకుంటూ గురువులను స్మరిస్తూ సాగుదాం రండి.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899