Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. భరద్వాజ పక్షులన్ని
భవ్యవౌ మధుర యందు
కీచుమంచు ధ్వని చేయుచు
కేరింతలు కొడుతున్నవి

2. తమమేతను తెచ్చు కొరకు
దవ్వుకేగ బెంగపడుచు;
పురుషోత్తము నొదులలేక
పులుగులగుమి వెనుకాడెను

3. చిన్నారుల గాజులసడి
జిలుగు వెలుగులతో చెలంగె;
తరుణుల మెడలందునున్న
తాళిబొట్టు ధ్వనులెసగెను

4. కవ్వముతో దధి చిలుకుచు
కన్నియ లొనరించుచున్న
ధ్వనులు వినబడుచుండగ
తరుణీ నీకేల నిదుర?

5. సాహసించి వెన్నదొంగ
సంహరించె కేశినెపుడొ
నీవు లేచి తోటి సఖుల
నిదుర లేపి రప్పింపుము

6. పద పోదము యనినంతనె
గది తలుపులు తెరచి ముగ్ధ;
సహ చెలియల చేరవేగ
గృహమునుండి బయటకొచ్చె

ఇంకా ఉంది