Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఎవరెవరి కన్న ఁదీసిపోరెవ్వరైన
వారలంతటి వారలు వారె గాద
యొకరు తక్కువగాదు వేరొకరుఁజాడ
నెక్వునవాదు కనుగొన నిది నిజమ్ము
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ

భావం: ఎవరెవరికన్నా ఏమాత్రం తీసిపోరు. ఎవరంతటివారువారు. ఒకరు తక్కువా కాదు. వేరొకరు ఎక్కువా కాదు. ఆలోచిస్తే ఇది అక్షరసత్యం అని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి తెలియజెప్పుమయ్యా దివాకరా!

తే.గీ. కారుకూతలు గూసిన గణన కెక్కఁ
బోరు సరికదా! చులకనై పోదురరయ
మృదు మధురమైన మాటలే మీటు నెదలఁ
గానఁ బ్రేమతో మాటాడఁ గలదు సుఖము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: కారుకూతలు కూయడం వల్ల అలాంటివారిని ఇతరులేమాత్రం లెక్కచేయరు సరికదా. ఎంతో చులకనైపోతారు. మృదుమధురంగా మాట్లాడితేనే ఎదుటివారి హృదయాలు చక్కగా స్పందిస్తాయి. కాబట్టి ప్రేమ పూర్వకం మాట్లాడడం వల్లనే సుఖం కలుగుతుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి తెలియుజెప్పుమయ్యా.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262