Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. తెలుపెసగెను తూర్పునందు
గొల్లలంత మేతల కని
పచ్చికగల బీళ్ళవైపు
పశుగణమును తోలినారు

2. తక్కిన గోపమ్మలపుడు
ఒక్కొక్కరు తరలుచుండ
మధ్యలోనె వారినాపి
మనవెంబడె రమ్మంటిమి.

3. వరుసబెట్టి వారలంత
వచ్చిరి మీ యింటి కడకు
రమణీమణి! లేచి రమ్ము
కమలాక్షుని దర్శింతము

4. యాదవుడత డైతెనేమి?
అద్భుతుండె మన కృష్ణుడు;
‘కేశి’ దౌడలను జీల్చెను
కేళిగ మల్లులను దునిమె

5. ముకుందుడు మనల జూచి
ముచ్చపడి వాంఛదీర్చు;
కుముదానన! రమ్మువేగ
కుదురుగ మమ్ములను గూడి

6. అని మార్గళివ్రతమునకై
అప్పుడతని నిదురలేపి
తప్పుకొనిరి యచటినుండి
దామోదరు నర్చించగ
ఇంకా ఉంది