Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పిల్లలన్నను వేల్పులు విశ్వమందు
స్వేచ్ఛ గల్గియు విహరింత్రు చిర్నగవులు
విసురుదురు శుభ చిహ్నాల వెల్గుల రయఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చిన్న పిల్లలంటే నిజంగా దేవుళ్లే. ఈ విశ్వంలో స్వేచ్ఛగా విహరిస్తారు పిల్లలు. విరిసే చిరునవ్వులను విసురుతారు. పిల్లలంటే శుభచిహ్నాల వెలుగులన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియుజేయమయ్యా స్వామీ.

తే.గీ. వృత్తియుద్యోగములలోనఁ జిత్తముంచి
న్యాయముంజేయ గైకొనునట్టి జీత
భత్యములు దృప్తినిం గోర్చు వారికంతఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: చేపట్టిన వృత్తి ఉద్యోగాల్లో మనసుపెట్టి న్యాయం చేస్తూ తీసుకొనే జీతభత్యాలు ఆత్మ సంతృప్తినిస్తాయన్నది వాస్తవమే కానీ ఈనాడు ఆత్మసాక్షికి జవాబు చెప్పుకోలేని పరిస్థితులు ఎదురైనా కనీసం మానవత్వం లేకుండా మసలుతున్నారు. వీరిలో మార్పులేకపోతే కష్టమన్న సంగతి కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియ జేయమయ్యా ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262