Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. కృష్ణమూర్తి సేవయందె
తృష్ణతోడ గోపాలురు;
పాకలోని పనులు మరచి
పాలు కూడ పితుకరైరి

2. అతి బిగుతుగ పొదుగులున్న
ఆవులు గేదెలు యరచుచు;
పాలను తమ లేగలకయి
వదిలెను నేలంత తడిసె

3. హిమపాతము యగుచున్నను
ఏ మాత్రము వెరుగొందక;
రామయ్యను కీర్తించుచు
మేముంటిమి బురదయందె

4. ఇరుగుపొరుగు పురజనాలు
ఇక్కడనే నిలిచినారు;
కలికి! నీదు మొద్దునిద్ర
తెలిసికొనిరి బిడియ పడుము

5. సిరిగల ఓ చిట్టిచెల్లి
పరికించుము మావెతలను;
సరగున నిటు బయటకొచ్చి
చేరవమ్మ మా సరసన

6. శ్రీరాముని గుణ నామపు-
స్మరణలతో పులకింతము,
సుగంధమయ సుమవర్షము
సుందరునిపై కురిపింతము

ఇంకా ఉంది