Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చదువుకున్నను సంస్కార సహృదయముల
నేలుకొన వచ్చు మనముల నిలుపుకొనగ
వచ్చు సద్భావ సంపత్తి మెచ్చునటుల
జూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం:చదువుకుంటే వచ్చే సంస్కారంతో సహృదయాలను చక్కగా అర్థం చేసుకొంటూ వారి అభిమానాన్ని పొందవచ్చు. ఇతరులు మెచ్చుకునేలా సద్భావ సంపత్తిని పోగుచేసుకోవచ్చు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి చదువుతో పాటు సంస్కారాన్ని కూడా పొందాలనే విషయాన్ని తెలియజేయుము ప్రభూ!
తే.గీ. విద్య విజ్ఞాన హేతువు విద్యజీవి
తాలఁ జక్కంగ దిద్దును తాల్మనేర్పు
విద్యమనుజుల ఁ గపుపును విద్యమేలు
గూర్చునెంతయో సుమ్మి సంకోచమేలఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: విద్య విజ్ఞానానికి కారణభూతము విద్య జీవితాలను చక్కదిద్దుతుంది. విద్య ఓర్పు కలిగియుండడాన్ని నేర్పుతుంది. విద్య మనుషులకు చక్కగా కలుపుతుంది. విద్య ఎంతో మేలు చేస్తుంది. ఈవిషయంలో ఏ సంకోచమూ లేదనే విషయాన్ని ఈలోకానికి తెలియుజేయుము ప్రభూ! ప్రభాకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262