Others

విచక్షణా జ్ఞానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విచక్షణను కలిగి ఉండటం కూడా గొప్ప జ్ఞానంగానే అనుకోవచ్చు. మంచి చెడుల విశే్లషణలో ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవడమే జ్ఞానం విచక్షణ అని అనుకుందాం. మంచిచెడు తెలుసుకోకుండా ప్రవర్తించినవారు తప్పక అనుకోని పరిస్థితులు ఎదుర్కొని వాటి వల్ల నష్టపోవాల్సి వస్తుంది.
ఏ పరిస్థితులలో మనం ఒకటి మంచి పనిఅనుకొని చేస్తుంటాం. మంచిపని అనుకొన్నాం కనుక ఆ పనిని ప్రయత్న పూర్వకంగా చేస్తాం. కొన్నిసార్లు అప్రయత్నంగా ఏది మంచో, ఏది చెడో తెలియకుండానే చేస్తాం. కానీ ప్రతి పనీ దాని ప్రతిఫలాన్ని మనకు తప్పక ఇస్తుంది. మంచిపనుల వల్ల మంచి ఆనందకరమైన ఫలం అందితే చెడు పనులవల్ల అందే చెడుఫలం అనుభవించేటపుడు కష్టంగా ఉంటుంది.
ఈ చెడ్డ పనులవల్ల కలిగే ఫలితాలలో మానసిక క్షోభ అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది. మంచేదో, చెడేదో తెలియవన్నంత మాత్రాన ఆ కార్య కారణాల ఫలితాలు రాకుండా మాత్రం ఉండవు. అందుకే ఏ విషయంలోనైనా కొంత ఆలోచన ముఖ్యం. మంచి-చెడు, సన్మార్గం-దుర్మార్గం, సత్యం-అసత్యం.. వీటిమధ్య విచక్షణ చేస్తూ మెలగడం ఎలాగో తెలుసుకోవాలి.
మనస్సు ప్రశాంతత పొందడానికి, సంతోషం పొందడానికి, ఆధ్యాత్మిక భావాలవైపు నిరంతరం పయనించడానికి ‘విచక్షణాజ్ఞానం’ తప్పనిసరి. ఈ జ్ఞానం బాగా అలవాటయినపుడు అప్రయత్నంగా ‘ఇది మంచి పనేనా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. తొందరపడి, తెలివి తక్కువగా చేసే తప్పుడు పనుల నుంచి, వాటివల్ల కలిగే మానసిక క్షోభ నుంచి ఈ విచక్షణాజ్ఞానం మనల్ని రక్షిస్తుంది. అయితే మన విచక్షణ ఏ పనిని మంచిదని చెబుతుందో దాన్ని కచ్చితం చెయ్యడాన్ని అలవాటు చేసుకున్నపుడు మాత్రమే అది మనల్ని రక్షించడం సాధ్యపడుతుంది. ఈ విచక్షణకు ఆత్మపరిశీలన చేసుకోవడం ఉత్తమమైన పని.
మనస్సు విషయ వస్తువులను గ్రహించే ప్రతినిధిగానూ, అనుభవించే భోగిగానూ వాటిని అంటి పెట్టుకునే ఉంటుంది. దానినే మనం బుద్ధి, అహంకారం లాంటి వేర్వేరు పేర్లతో వ్యవహరిస్తుంటాము. మనస్సే గనుక జీవుడి యొక్క నిజ స్వభావమైతే జీవుడికీ, విషయ వస్తువులకు మధ్యనున్న సంబంధాన్ని విడగొట్టడం సాధ్యపడదు.
కానీ జీవాత్మ ఆది అంతాలు లేకుండా ఎల్లప్పుడూ బ్రహ్మంతో ఏకమై ఉన్నాడు. మనస్సును కప్పుతూ తొడగబడి వున్న ముసుగువల్ల జీవాత్మ విషయ వస్తువులతో ఆకర్షణను, అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. మనిషి తానే పరబ్రహ్మమని భావిస్తూ ప్రాపంచిక వస్తువులపట్ల, ఆకర్షణలపట్ల వ్యామోహాన్ని విడిచిపెట్టి, ప్రాపంచిక ఆకర్షణలు నిజం కాదని నిరంతరం భావించడం ద్వారా వాటినుంచి తమ దృష్టిని మరల్చుకొని భగవంతుడిని ఆరాధించాలి అనే తత్వం ప్రతి మనిషిలో ఉండాలి. లేకపోతే చెడు పనులకు త్వరగా ఆకర్షితులవుతారు. అపుడు చెడుఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. పనులు చేసేటపుడు ఆలోచన లేక నవ్వుతూ చేస్తే ఆతర్వాత ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. అందుకే పెద్దల మాటలను వింటూ నిత్య జీవితంలో కర్తవ్యాన్ని పాటిస్తూ ఏది మంచి ఏది చెడు అనేది విచక్షణతో ఆలోచిస్తూ మంచి పనులను మాత్రమే చేయాలి. అపుడే ఏకాలంలోనైనా ఆనందంగా ఉండగలుగుతారు.
ఆధ్యాత్మిక వికాసం కలిగిన వ్యక్తి సాధనతో తనలోకి తాను పయనించగలడు. అలా పయనించినపుడు అతని యొక్క ఆత్మ వికసిస్తుంది. శ్రీకృష్ణుడి బోధన విన్న అర్జునుడికి జ్ఞనం కలిగినట్టుగా గీత చెబుతుంది. అంతక్రితంవరకూ అర్జునుడు యుద్ధం చేయుటకు సంశయించాడు. నావాళ్ళతో నేను యుద్ధం చేయాలా? నావాళ్ళను చంపాలా? అని సంకోచించాడు అర్జునుడు. కానీ, గీతా ప్రవచనం వినగానే అర్జునుడికి ఆత్మవికాసం చెందిం ది. ఎప్పుడైతే కృష్ణపరమాత్మ నోటి నుండి పవిత్రమైన గీతను విన్నాడో అతనిలో సంశయాలన్నీ తొలగిపోయాయి. అతనిలో అజ్ఞానంపోయింది. ఆత్మవికాసం అయింది. ఉన్నదంతా ఏకాత్మ అనే భావన కలిగింది అర్జునుడికి ఆ సమయాన.
దానితో తాను చేస్తున్న పని గురించి అవగాహన కలిగింది. అట్లానే ప్రతిరోజు కూడా పెద్దవారి మాటలు వింటూ ఉంటూ చేస్తున్న పనిలో మంచిచెడులు తెలుస్తాయ. అపుడు మంచి చేయొచ్చు ఆనందం పొందొచ్చు.

- వాణీ ప్రభాకరి