Others

జ్ఞాన ఉదయం.. అహంకార నాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆండాళ్ తల్లి తన తోడివారిని నిద్ర మేలుకొనుడు అని చెప్పడానికి ఈరోజు ఇలా చెబుతున్నది. సూర్యోదయం కాబోతున్నదని తెలుసుకొని తమను వీడి తమ వెనె్నలరేడు దూరమవుతున్నాడని అనుకొంటూ నల్లకలువలన్నీ ముడుచుకుపోయాయి. వాటికన్నా ముందే ఎర్ర తామరలన్నీ భానుడి వెచ్చని కౌగిలి కోసం ఆరాటపడుతూ ఒకదానికన్నా మరొకటి ముందుగా విచ్చుకుంటున్నాయి. తపశ్శాలురు, సన్యాసులు, కాషాయ వస్తధ్రారులు ఆఖరికి గృహస్థులు కూడా వారి వారి పనులన్నీ చేసుకొని కోవెలకు వడివడిగా వెళ్లుతున్నారు.
శంఖచక్రాలను ధరించి ఉన్న శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడై వెలిసి యున్నాడు వానిని కొలువడానికి కోటిమంది ఇప్పటికే వేంచేసి ఉన్నారు. నీవు త్వరగా రమ్ము అని పిలుస్తూన్న ఆండాళ్ పిలుపులోని అంతరార్థం ఏమంటే - ఈ శరీరమే ఓ తోట. చైతన్య ప్రసరణ మార్గమగు నాడీ మండలం వెన్నుపూసలో ఉంద. ఇది దిగుడుబావి. తామర పూవులంటే నాడీచక్రములు,. మూలాధారం, స్వాధిష్ఠానం మొదలగు చక్రాలు కలువలనగా ఇంద్రియాలు. ఇక తోట అంటేనే అష్టాక్షరీ మహామంత్రం. ఇందులోని బావి అంటే నమః అను అక్షరద్వయం. తామర పూవు అంటే పారతంత్య్రము. కలువపూవు అంటే స్వాతంత్య్రం. జేగురు రాయి లాంటిది మన మనస్సు.
ఇది అన్నింటినీ ఆకర్షిస్తుంది. కానీ కుంచెకోలలను ఆచార్యజ్ఞాన ముద్రగా తలిచి చూపుడువేలు బొటనవ్రేలితో కలసి ఉండడం అంటే మనస్సు భగవంతుని పైన నిక్షిప్తం కావడం. ఇక మిగిలిన మూడువేళ్లు గుణ త్రయం, గుణత్రయానికి ఎప్పుడైతే దూరం అవుతారో వారంతా భగవంతునికి దగ్గర అవుతారన్నమాట. శంఖచక్రాలను భుజములందు చిహ్నాలుగా దాల్చిన వారే పరమాచార్యులు.అందరూ ఆశ్రయించవలసింది వీరినే. నంగాయ్, నాణాదాయ్ నావుడయామ్ అను సంబోధనలు తిరుప్పాణియాళ్వారుకు సరిపోతాయి. నంగాయ్ అంటే గుణపరిపూర్తిని తెలుపుతుంది. నాణాదాయ్ అం అహంకార రాహిత్యాన్ని తెలిపే పదం. ఈ ఆళ్వారులు లోకసారంగ మహామునుల భుజాలపై కూర్చుని ఆచార్య పురుషుల ఇండ్ల ముందునుండి సాగుతూ అహంకారమేమీ లేకుండా చేతులు జోడిస్తూ అడియార్కెన్నై యాట్పడుత్త విమల అంటే నీదాసులకు నన్ను దాసుని చేసిన విమలా అని వీరు అంటూ గొప్ప ఆనందంతో కోవెలకు వెళ్తున్నారు. కణ్ణినుణ్ శిరుత్తాంబు ను జపించి నమ్మాళ్వారులను ప్రసన్నులను చేసుకొని నాలాయిర దివ్య ప్రబంధాన్ని పొంది దివ్యంగా గానం చేసి అందరిచేతా చేయించి లోకాన వ్యాపింప చేసిన మహానుభావులు. ఇంతటి గొప్ప గొప్పవారు కూడా కృష్ణ దర్శనం కోసం కృష్ణుని స్తుతించడం కోసం వెళ్తున్నారు కనుక మ నమూ వారితో వెళ్దాం రండి.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899