Others

కలసి భజన చేద్దాం రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపికలను నిద్ర నుంచి మేల్కొనుడు అని చెబుతూ వస్తున్న ఆండాళ్ తల్లికి ఆమె చెలులకు ఓ చోట పరమాద్భుతమైన విషయం తెలిసింది. ఓ ఇంటికి వచ్చేసరికి ఇంటిలోని గోపిక మేల్కొనియే ఉన్నది కాకపోతే బయటకు రాకుండా లోపల నుండే నిద్ర లేపుదామని వచ్చిన వారికి సమాధానాలు ఇస్తోంది. మీరు ఊరికే గోల చేస్తూ మాట్లాడకండి. నేనేమీ నిద్రపోవడం లేదు. నాకు అంతా తెలుసు అంటూ చిలుకపలుకులు పలికిందా వనిత. దానితో బయటనున్నవారు 3ఏమమ్మా నీకు ఏమి తెలుసు. గడుసుదానివలె మాట్లాడుతున్నావు. అన్నీ తెలసినదానివైతే నీవెప్పుడూ ఆ చాణూర ముష్టికులను చంపిన వారిని నీవు స్తుతించడానికి వెళ్లాలి కదా. ఇంకా ఎందుకు లోపలే ఉన్నావు అని అడిగారు. ననే్న అంటున్నారు కదా సరే ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. కువలయమును ఆనాసయసంగా చంపిన వానిని సేవించడానికి పరుగుపరుగున వస్తున్నాను. మరి అందరూవచ్చారా అది చూసుకొన్నారా అని అడిగింది. ఇక్కడ చిలుకపలుకులతో పోల్చారంటే అర్థం భగవత్సారూప్యం నందిన ఆచార్యుడు. భగవంతుని ఆరాధిస్తూ అతనికి షోడశోపచారాలు చేస్తున్నపుడు వాకిట మరోరూపంతో భగవంతుడే వచ్చినా అది కూడా అంతరాయంవలె కనిపిస్తుంది అనే తాత్పర్యంతోఈ పాశురం కనబడుతుంది.
భాగవత గోష్ఠిని విడిచి ఒంటరిగా ఉండరాదు. ఏ ఒక్క్భక్తుడూ భగవంతుని సేవకు రానట్టుఅయితే వెలితిగానే కనబడుతుంది. ఇళంకిళియే అని చిలుకనుసంబోధించడంలో నమ్మాళ్వారు ఉనక్కెన్నవేరుడయ అంటే నమ్మాళ్వారు సాధించిన శిరియ తిరుమడల్ పెరియ తిరుమడల్ అనే రెండు ప్రబంధాల వైలక్ష్యణమే వీరి వైలక్షణ్యం..
శ్రీమతే శఠకోపాయనమః స్వామి తిరువాయ్ బొళి ని నాకు సంత చెప్పి నాచే పలికించిరని వీరు చెప్పుకుని యున్నారు.అందుకే వీరు చిలుక. ఆళ్వారులందరిలో వీరే చిన్న వయసు కలవారు. వీరు ఇళంకిలియే కూడా. చిలుక పలుకుల వలె అందంగా తీయగా మాట్లాడు వీరు అమృతానందించే సూక్తులను అందించారు. నంగైమీర్ అనే సంబోధన కూడా వీరికి సరిపోతుంది.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899