Others

రామనామం అమృతస్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామనామము కల్పవృక్షము. అది ధర్మార్థ కామ మోక్షములనిచ్చునది, నాల్గు వేదములు, పురాణములు, పండితులు, చివరకు శంకరుడు సైతము రామనామానే్న పరమార్థ సారముగా నిరంతరం రామానామానే్న జపిస్తుంటాడు.ఒక్క రామనామం ఉంటేచాలు అదే కల్పవృక్షము దారుణమైన దుఃఖాన్ని , దారిద్య్రాన్ని నాశనం చేస్తుంది. సర్వకాల సర్వావవస్థలందు రామనామమే రక్షిస్తుంది. జనన మరణ చక్రమునందు ఇరుక్కొని యుగయుగాలలో కూడా దుఃఖభాజనుడయ్యే మనిషిని కేవలం రామనామజపం వల్ల రక్షించి వైకుంఠుని దరికి చేరుస్తుంది. భవబంధాల్ని త్రెంచుకొనుటకు రామనామముతప్ప మరొక సాధనమేదీలేదు.
అమృతంకన్నా మహిమాన్వితమైంది. సులభతరమైంది. ఈ సంసార సాగరాన్ని సులభంగా ఈదగలిగేట్టు చేసేది కేవలం రామనామమే. ఏవేళలోనైనా చేప ఆవాసానికి నీరెంత ముఖ్యమో, మనిషి జీవనాధారానికి రామనామం అంతముఖ్యం. ప్రేమతో శ్రీరామనామాన్ని జపింపుము. అసహాయులకు ప్రాణమిత్రము, అభాగ్యులకు భాగ్యము, గుణహీనులకు గుణము, దరిద్రులకు ఆశయము, దీనులకు దాత. శరణార్థులకు అభయం ఇలా రామనామం దేనికైనా పనికి వస్తుంది. ఏదీ రాకపోయనా పూర్వజన్మ పాపంతో నరకయాతనలు పడుతూ జీవించలేకపోతున్న వారికి కూడా ఒక్కసారి రామనామం నోరారా జపిస్తే చాలు వారి బాధలన్నీ క్షణాల్లో దూరమవుతాయ. రామనామ స్మరణ అవిటివాడికి హస్తపాదములై, అంధులకు నేత్రాలయి, ఆకలిగొన్నవారికి తల్లిదండ్రులై, నిరాధారులకు ఆధారమై, భవసాగరము దాటుటకు సేతువై ముక్తికి హేతువై నిలుస్తుంది అని ఈ భూలోకంలోనే కాదు ముల్లోకాల్లోను రామనామ విలువ గురించి చెబుతారు.
రామనామానికి మించిన పతిత పావన శక్తి మరియొకటి లేదు. రామనామం చలికి అగ్నివంటిది. దాని స్పర్శనుండియే కలిపురుషుడు తన పరివారంతో సహా దూరమై పోతాడు. రామనామ మైత్రివల్ల వైరాగ్య యోగాది ముక్తి సాధనములన్నియ తమకు తాముగా దరిచేరుతాయ. విధిరాతకూడా రామనామ జపం వల్ల మారిపోతుంది. మంచికాలం వస్తుంది. రామనామమను కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే ఇహపర సౌకర్యాలు పొందవచ్చు. రామనామాన్ని ప్రేమించగలిగేవారు ముల్లోకాల్లో ఎక్కడైనా సురక్షితంగా తిరుగగలుతారు.
త్రేత ద్వాపర యుగాలలో ప్రజలు నిత్యం సుఖ సంతోషాలతో, ఆనందసాగరంలో మునిగితేలారు. కానీ ఈ కలియుగంలో మాత్రం ఎప్పుడూ దుఃఖపూరితంగానే ఎక్కువగా కనిపిస్తారు. కారణం ఆయా యుగాలో ప్రజల్లో, సమాజంలో ధర్మం, న్యాయం నిండుగా వుండేది. ప్రజలలో పాపభీతి ఉండేది. నరనరాన దైవభక్తితో ప్రజలు పరవశించేవారు.ఈ కలిప్రభావంవల్ల ఈ యుగంలోని మానవులో స్వార్థం, కామం, మోహం, లోభాపేక్షలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తత్ఫలితంగా దైవభక్తి సన్నగిల్లిపోతుంది. అందువల్లనే మానవుడిలో పుణ్యఫలం తగ్గి పాపఫలం పెరిగిపోతుంది. దీని ప్రభావం కేవలం మానవ జాతిమీదనే కాక ప్రకృతిపై కూడా పడుతుంది. త్రేతా ద్వాపరయుగాల్లో మాదిరిగా మానవుడు నిస్వార్థంగా యజ్ఞయాగాదులు చేయకపోవడం, సమాజ శ్రేయస్సు కోసం కనీసం తన శ్రేయస్సు కోసం కూడా జపతపాలు కావించకపోవడంవల్ల ప్రకృతి వికృతిగా మారుతుంది.ఇన్ని ఘోరాలు నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రతిమానవుడు కులమతభేదం లేకుండా వారువీరను తేడాల్లేకుండా రామనామాన్ని అహర్నిశమూ జపించాలి. కేవలం రామనామం వల్ల పాపపంకిలం నదీస్నానాదులవల్ల కొట్టుకునిపోయే మురికివలె కొట్టుకుపోతుంది అపుడు కలియుగం కూడా కృతయుగంలాగా భాసిస్తుంది. మానవులందరూ దివ్యులై ఆనందాన్ని అనుభవిస్తారు. దీనికి తరుణోపాయం మాత్రం రామనామ జపమే.

- చివుకుల రామమోహన్