Others

‘‘పర ’’ఇచ్చే పరంధాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయకుడై ఉన్న నందగోపుని భవన రక్షకా! జెండాతో ఒప్పుచున్న తోరణ ద్వారపాలకా! మణికవాటపు గడియ తెరువుము. మేము స్నానపానాదులచేత శరీర మాలిన్యాన్ని కృష్ణనామజపంద్వారా మనసు మాలిన్యాన్ని దూరం చేసుకొని మరీ వచ్చాము. మాకు కృష్ణుడు పర అను వాయిద్యాన్ని ఇస్తానని నిన్ననే వాగ్దానం కూడా చేసి ఉన్నాడు. కనుక నీవు త్వరగా తలుపు తెరిస్తే ఆనందగోపుని ముఖారవిందాన్ని మేము వీక్షిస్తాము అని ఆండాళ్ తల్లి తో వచ్చిన కన్నియలందరూ పలికారనే చెప్పే ఈ పాశురం అంతరార్థాన్ని చూద్దాం.
ఆనందరూపుడగు భగవానుని అనర్హుల చేతిలో పడకుండా కాపాడువాడే నందగోపుడు. నందగోపుని భవనమనగా మంత్రరాజం. దానిలోని జెండా మనశ్శబ్దార్థాన్ని భావన చేయుట ద్వారమునకు తోరణం కట్టుట.
తలుపులు అనేవి ఆత్మస్వరూప జ్ఞానము, దానివలన కలుగు స్వస్వాతంత్య్రము. వీటిని ఆచార్యుడే తెరిచి మనలను లోపలికి అనుమతించాలి. మమ్ములను అడ్డుపెట్టవద్దు. మేము ఎంతో ఆశతో మా పాపరాశులన్నీ దగ్ధ చేసే పరను వాయించుదామని ఎంతోఆతురతో వచ్చాం అని భాగవతులందరూ భగవంతుని మందిరం చేరారు. మనమూ వారితో కలసి భగవంతుని నామాన్ని నోరారా పలుకుతూ చేతులతో పర అనువాయిద్యాన్ని వాయించుతున్నట్టుగా చేద్దాం. మనలను కరుణించడానికి ఆ నందగోపుడు, మన ప్రియమైన దేవాదిదేవుడు వచ్చితీరుతాడు.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899