Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. దివ్యమణులతో పొదిగిన
భవ్యోజ్వల సౌధమందు,
గరుడ చిహ్న కేతనాలు
కళలెసగుచు నెగురుచుండె

2. వ్రేపల్లె గోపికల మిట
వేచినాము ద్వారముకడ
బిగియించిన తలుపు గడియ
బేగి నీవు తొలగింపుము

3. అని గోదయు గోపికలును
అచటి ద్వారపాలకుడిని,
వేడుకొనిరి నమ్రతతో
వేణుధారి కడకేగగ

4. మాకు నిన్న కృష్ణస్వామి
మాటిచ్చెను ‘పర’ యని యెడి
మధుర స్వర వాయిద్యము
మమత తోడ మాకివ్వగ

5. పరిశుద్ధపు డెందాలతో
పరమాత్ముని మేల్కొల్పగ
వచ్చినాము వ్రేపల్లియు
వ్రజకాంతల మెల్లగూడి

6. స్వామిని మా బృందగణము
స్మరియించుచు దర్శించును
సింహద్వార కవాటాలు
శీఘ్రముగ తెరువుమయ్య

ఇంకా ఉంది