Others

నామకీర్తన .. భవబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారం నుండి లోపలకు వచ్చిన తర్వాత చల్లని తీర్థం, ప్రసాదాన్ని, వస్త్రాలను కూడా ఇచ్చే ధర్మబుద్ధి ఉన్న ఓ స్వామీ!నందగోపాలుడా! మేల్కాచుము. నీటి ప్రెబ్బలి మొక్కవోలె ఉన్న ఓ యశోదమ్మా నీవు స్ర్తిజాతికే మణివి. చక్కని దేదీప్యమానంగావెలిగే జ్యోతివి. వంశకీర్తిని పెంచే ఓ నందుని ఇల్లాలా! ఇక మేల్కొనుము. లోకాన్నింటిని గెలిచే సామర్థ్యమున్న తమ్ముని పొందిన ఓ బలరామా! నీవును మేల్కొనుము. ఎర్రని బంగారు కడియాన్ని పాదంపై ధరించిన ఓ బలశాలీ బలరామా! మేల్కొనుము. ఆకాశ మధ్యమును భేదించి పెరిగి తన పాదాలతో లోకాలను కొలిచిన నిత్యసూరినాయకా ఇక నిద్ర చాలించి మేల్కొనుము అంటూ యశోదమ్మ ఇంటిలోని వారినందరినీ ఆండాళ్ తల్లి, ఆ తల్లితో గూడా వచ్చిన స్ర్తిజనం అంతా మేల్కొల్పుతున్నారు.
- భగవన్ముఖ వికాసము నొసంగ శేషత్వం, పరబ్రహ్మం పరమాకాశమే అంబరము వస్తమ్రుగా భావించాలి. భోగ్యతా బుద్ధి లేకుండా పారతంత్య్రము పొందవలయుననెడి శ్రద్ధనే జలాలు అవే విరజానదీజలాలు. భగవత్కైంకర్యం , నిష్కృష్ట ఆత్మస్వరూప జ్ఞానం, బ్రహ్మానుభవమే ఆహారంగా అనుభవించాలి. నందగోపాలుడే మన ఆచార్యుడుగా భావించాలి. యశోదమ్మనే మంత్రంగా జపించుకోవాలి. మంత్రాలలో విష్ణుషడక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి అష్టాక్షరులు ముఖ్యములు. వాటిల్లోకెల్లా అతి శ్రేష్ఠమైంది అష్టాక్షరీ మహామంత్రమే. ఆ మంత్రమే యశోదమ్మ తల్లి.
సర్వశూన్యవాదులగు వేదబాహ్యులను నిరసించి సర్వ జగద్వ్యాపకమగు భగవతత్త్వము కలదని తన అస్తిత్వమును అంతటా చూపినది వామనావతారం. బలరాముని పాదమునకు తొడిగిన కడియము భగవచ్చేషిత్వము.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899