Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. ముఖద్వారము తెరువగనే
మూకుమ్మడిగ వనితలు
నందగోప ప్రభువునుగని
వందనమ్మిడి వేడినట్లు

2. స్వామీ! మీ దాతృత్వము
సర్వజనుల కొదవు హితము,
విరివిగాను మీరిత్తురు
నీరు, అన్న వస్తమ్రులను,

3. భోగభాగ్యముల నందుచు
సుఖజీవన యాత్ర జేయ
మీ సత్కృప మాకు వలయు
మేల్కొనండి వేకువయ్యె

4. యదువంశపు దివ్యజ్యోతి
యశోదా! నిదురలెమ్ము
బలభద్రా! కృష్ణానుజ!
పైడి కడియధారి లెమ్ము

5. పడకపాన్పు నొదిలిపెట్టి
పరమాత్ముని కూడిలెండి,
సర్వజగతి హర్షమొందు
సర్వోత్తమ స్వామి జూచి.

6. గోపికామణులెల్లరు
గోవిందునకై వేచిరి
జాగుయేల త్వరగ లేచి
జగత్తునే యలరించుడి.

ఇంకా ఉంది