Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ సర్వమత సారమొక్కటే సకల జనులు
భేదభావాలు వీడుచు వెలుగు పూల
తోటలనుఁబెంచి పోషింప దొరకు సుఖము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!
భావం: జనులంతా భేదభావాలు లేకుండా సర్వత్రా వెలుగు పూల తోటలను పెంచి పోషించిన పక్షంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అలా లభించిన సుఖ సంతోషాలను జనులంతా అనుభవించాలన్నదే సర్వమత సారమని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్యా ప్రభూ!
తే.గీ సాటివాని కష్టాలకు జాలిపడుచు
రెండు కన్నీటి బొట్లను లేచి విడువఁ
బోరు మానవ పుట్టు పుట్టుటేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!
భావం: నేటి సమాజంలో సాటివారు కష్టనష్టాలతో అల్లాడిపోతుంటే జాలిగా రెండు కన్నీటి బొట్లయినా లేచి విడువనివారెందరో వున్నారు. అలాంటివారు ఉదాత్తమైన మానవ పుట్టుక పుట్టడం దేనికో? స్వార్తం తొంగిచూడరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్యా ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262