Others

భగవద్గుణ గానం మధురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుని నిదుర నండి లేపుటను నీళాదేవిని లేపుట మరిచి యుండుటచే నీళాదేవినే ప్రత్యేకించి నిద్ర లేపుతున్నది. మదమును స్రవించు ఏనుగుల బోలిన బలము కలవాడు. వెనుదీయని భుజబలము కలవాడైన నందగోపుని కోడలా నప్పిన్నారాట్టి ! సువాసన గుబాళించుచున్న కొప్పు కలదానా! గడియ తీయుము. కోళ్లు వచ్చి అంతా కూయుచున్నవి. మాధవి పందిరపై పలుసార్లు కోకిలల గుంపులు కూయుచున్నవి. బంతితో నిండిన వ్రేళ్లు కలదానా!నిద్రనుంచి మేల్కొనుము అని చెబుతున్నారు.
ఓ నీళాదేవీ! నీ మేనత్తకొమరుని కొలుచుటకై వచ్చి ఉన్నాము. ఎర్రతామరలవంటిమృదువైన ఓ హస్తములు గల సుకుమారీ నీ చేతికిఉన్న కళ్యాణ గుణములు గల గాజులు గల గల ధ్వనిసేయునట్లుగా వచ్చి తలుపును తెరువుముఅని ఆండాళ్ తల్లి చెబుతున్నది.
భగవానుని వశములో నుంచుకొనిన ఆచార్యులే ఏనుగులను వశీకరించుకొను నందగోపుడు. అతని పల్లె ఆచార్య కులము. అదియే వ్రేపల్లె. గడియ తీయుట అనగా అమ్మ కటాక్షించికర్మానుగుణంగా కాక కృపానుగుణముగా మనను పరమాత్మ రక్షించునట్లు చేయుట. కోళ్లు కూయుచున్నవి అంటే భగవత్కైంకర్యములో శద్ద్ర గల భగవద్భక్తులు ఆచార్యులు. నీళాదేవి చేతులు కళ్యాణ గుణములను ధ్వనించునట్లుగా తలుపు తీయమనడంలోని అర్థం అనన్యార్హ శేషత్వము అనన్య శరణ్యత్వము, అనన్య భోగ్యత్వమును తెలియుపరు చుటయే. కోకిలలు అనగా ఇక్కడ భగవంతుని నామాన్ని మధురంగా గానం చేసేవారు. ఎంత నామసంకీర్తన చేసినా, ఎన్ని భాగవత కథలు విన్నా తక్కువగా అనిపిస్తుంది.కనుకఆచార్యులను ముందు పెట్టుకుని మనమంతా ఆ యశోదమ్మకొడుకు నందుని ముద్దుల పట్టియైన పరంధాముని కొలుద్దాం రండి.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899