Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శక్తులుడిగిన వారన్న సరకు చేయ
రట్టివారికి మట్టుకు నరయ శక్తు
లుడుగ కుండునా ? యవివేకముడుగకుండెఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: శారీరకమైన శక్తులు నశించిన వారిని చాలామంది ఏ మాత్రం లెక్కచేయరు. అలా లెక్కచేయనివారికి మట్టుకు శక్తులు ఉడగవా అంటే వారికి కూడా శక్తి తగ్గిపోతుందికదా.శక్తులుడిగిన వారిని ఎందరిని చూసినా వీరిలో అహంకారమే అజ్ఞానం వల్ల వృద్ధులను ఆదరించడంలో మార్పు రావడం లేదు. వృద్ధజనాదరణ ఎంతో పుణ్యకార్యమని కర్మసాక్షివైన ఓసూర్యదేవా నీవైనా ఈలోకానికి ప్రబోధించుము ప్రభూ!
తే.గీ. ఆస్తులను ఁబంచుకున్నచో యదియు సరియు ఁ
దల్లిదండ్రులఁ గొడుకులు దలుపఁ బంచు
కొనెడి తీరు దుర్మార్గంబు కువలయానఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఆలోచిస్తే ఆస్తులను పంచుకోవడం పరిపాటే!కానీ, ఆస్తులను పంచుకున్నట్లుగా కన్న కొడుకులై యుండి వృద్ధులైన తల్లిదండ్రులను పంచుకోవడమనేది ఈ భూమండలమందు పరమ దుర్మార్గమని కర్మసాక్షివైన ఓ ప్రభూ సూర్యదేవా నీవైనా తెలియుజేయుము మార్తాండ తేజా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262