Others

పాశురాలతో పాపనాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఆండాళ్ తల్లి ఈరోజు నీళాదేవిని నిద్ర నుంచి మేల్కొపడానికి బయలుదేరింది. గుత్తి దీపాలు వెలుగుతుండగా దంతపు కోళ్లు గల మంచంపై మెత్తనైన ఐదు లక్షణములు గల పాన్పుపై పడుకుని ఉన్న ఓ నీళాదేవి నిన్ను ఆనుకుని శయనించి ఉన్న ఓ విశాల వక్షఃస్థలం గల ఓ దేవాదిదేవా! నీవును మేల్కొనుము అంటూ ఆండాళ్ తల్లి నీళాదేవిని, శ్రీకృష్ణ భగవానుని మేల్కొపుతున్నది. ఓ దేవా నోరు తెరువుము. ఒక మాటను పలుకుము. కాటుకచే విశాలమగు కన్నులుగల ఓ నీళాదేవి ఒక్క క్షణమైన స్వామి విరహాన్ని ఓర్చలేనట్లుగా కనిపిస్తున్న ఓ నీళాదీవి ఇది నీకు తగదు.ఏనుగుదంతముల వంటి కాళ్లు కలిగిన మంచంపై మృదువైన శీతలత్వం, మార్దవం, విశాలత్వం, సుగంధత్వం, శే్వతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్యను అధిరోహించి గుత్తులుగుత్తులుగా వికసించి ఉన్న పుష్పమాలలను ధరించిన కురులతో శ్రీకృష్ణుని ఆనందింపచేయుచున్న ఓ నీళాదేవి అని సంబోధిస్తూ ఆండాళ్ తల్లి వారిని మేల్కొపుతోంది. నీ స్వభావానికి ఇలా పడుకొని ఉండి పోవడం తగదు అని చెప్పే ఆండాళ్ అంతరార్థం ఏమంటే శ్రీమన్నారాయణ తత్వం నెరిగించు జ్ఞానమే దీపం. ఆ గుత్తులుగా వేలాడే దీపాలు అంటే శ్రుతి, స్మృతి, ఇతిహాసము, పురాణాలు, ఆగమాలు అనేవే దీపాలుగా వెలుగుతున్నాయి. మంచమనగా కర్తృత్వాహంకారం, భోక్తృత్వాహంకారం, జ్ఞాతృత్వాహంకారం, శేషత్వాహంకారం అనే నాలుగు అహంకారాలావంటి కోళుగలిగిన మంచంపై పూలతో నిండిన కేశపాశము కలదానా అని అనడంలోని అర్థం వ్యామోహజనకమైన శేషత్వాన్ని కల్గి ఉండడం. వీటిని వదిలి కాటుకున్న కనులున్న నీళాదేవి మేల్కొనుము అనగా భక్తి అనే కాటుకను కళ్లకు దిద్దుకుని మా భక్తితోనే పాపాలను నశింపచేసుకోవడానికి ఆ పరంధాముడిని కొలువమేమంతా వచ్చి ఉన్నాము.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899