Others

నా చిన్ననాటి భోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగమ దేవర శంఖపు రవళులు
శంభో శంకర నా దంతో ఊరంతా
అంబ బలుకు జగదంబ బలుకు
వాక్కుతో బుడబుక్కల ఢమ ఢమలు
భోగి వేకువ జాముకు వేకువ కాగ!

చెరువుకు నీళ్లకి నాన్న కావిడితో
మావూరి చెరువేమో తెలిమంచు కప్పుకొని
సూరీడికేదో కబురివ్వాలని రాయబారి
తుషారపు దొంతర్లతో మంతనాలు
ఎంతకీ ఒగదెగవవి ప్రభాత మంతా

తోటి పిల్లలతో దార్లన్నీ తిరిగి ప్రోగేసుకున్న
వరి కర్రలో తుమ్మ పత్తి వేప పుల్లలో
అమ్మవంటకి దాచిన వంట చెరుకో
అన్నిటితో బోగిమంటకు తయ్యారు
అత్తయ్య మామయ్య తాతయ్య నానమ్మలు
ఒళ్లంతా రగ్గులతో చలికి వణుకుతూ
నాన్న తోబుట్టులు నీళ్ల బిందెలతో హాజరు
అమ్మ తోడుకోడళ్లతో వంటలింకా తెమలక

రంగవల్లులు అల్లాలని తొందరలో అక్కావదిన
గొబ్బెమ్మలు బంతిపూల ఏర్పాట్లలో చెల్లి మరదలు
పిన్ని బాబాయి అగ్ని దేవుని ప్రార్థన జేసి నెయ్యేసి
భోగి మంట రాజేస్తే బందు గణమంతా చుట్టూ

మేమంతా భోగిమంట చలి కాచుకుంటుంటే
కొత్త ధాన్యపు బస్తాల బండ్లతో ఇళ్ల్లకు కొందరు
దారంతా రంగుల మ్రుగ్గులు పెడుతూ ఇల్లాలు
అయ్యవారికి దండం బెట్టంటు గంగిరెద్దులోళ్లూ

కాటి కాపరి వస్తే మాత్రం ఏ పురిచాటునో
చటుక్కున ఎక్కడ నుంచి ఏం తీస్తానంటాడొనని
ఊరంతా సందడే! అన్ని మూలలా రంగవల్లులు
హరిదాసులు శ్రీమద్రమణ గోవిందో హరంటూ
బావలు పిట్టల దొరలా కథలు చెబుతుంటే
సినిమా కథలకి పనికొస్తాయని నవ్వుతూ మేము

బోగి మంటన హవిస్సులు ఎంత సమర్పించాలో
ఎప్పుడు మంట నిప్పులు కదపాలో అణచాలో
చుట్టూ చేరి జాగ్రత్తలు జెప్పు పెద్దల జుస్తి
జీవన గమనంలో సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ
మీ వెంట మేమని అగ్ని సాక్షిగా భరోసా నిచ్చు
నా వారిగ తృప్తిగా రేపటి సంక్రాంతికై జూస్తూ....

- రవి కిషోర్ సెంట్రాల (లండన్)