Others

భగవంతునిపై ప్రేమే భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుణ్ణి చేరడానికి వున్న అనేకానేక దారులలో భక్తి అత్యంత ప్రధానమైంది. ఇందులో పూజ, నామస్తోత్రం, జపం అనేవి అంతర్గత సాధనాలు. భక్తి మార్గంలో వెళ్లినా భగవంతుడు నా కోరికలు తీర్చడం లేదనే భక్తులు ఉంటారు. అసలు కోరికలతో భగవంతుడిని పూజించడం కాదు. భగవంతుని పై ప్రేమతో తనకు ప్రసాదించినవాటిని కృతజ్ఞత లు చెప్పడానకి పూజ చేయాలం టారు ఫెద్దలు. స్వార్థపూరిత భావాలతో భగవంతుడికి నమస్కారం చేయకూడదంటారు. మొక్కులు మొక్కుకుని అవి తీరితే భగవంతుడు ఉనికి ఉన్నట్టు లేకపోతే లేనట్టు అనుకోవడం అవివేకం. మన పూర్వ జన్మసంస్కారాన్ని బట్టి విధి ఉంటుంది. మన కర్మలను బట్టి ఫలితాలు వస్తాయ. అంతేకానీ కర్మల ఫలితాలు త్రీవంగా ఉంటే అవి భగవంతుని పూజ వల్ల ఉపశమించ బడుతాయ అంటే పెద్ద కత్తితో వేసే వేటును చిన్న సూది దెబ్బతో సరిపెడు తాడు కానీ ఆ సూది దెబ్బకూడ ఉండకూడదని భగవంతుడికి నమస్కారం చేస్తాం మొక్కులు మొక్కుతాంత అంటే భగవంతుడు మన మాట వినడు. కర్మను అనుసరించి ఫలితాన్ని స్తాడు కానీ భగవంతునికి ప్రియాప్రియాలు ండవు. భగవంతుడికి భక్తుడికి మధ్యనుండాల్సింది నమ్మకం, భయం, ప్రేమ, విశ్వాసం. భగవంతుడు అంటే ఇచ్చేవాడు మాత్రమే. ఆయనది సదా ఇచ్చే చేయి మాత్రమే. ఆయన హస్తం ఎప్పుడూ ఇవ్వడమే తప్ప తీసుకోవడం ఆశించదు.అటువంటి పురుషో త్తమునితో సత్ సాంగత్యం ఉండాలి కానీ మొక్కుకోవడం అనేది మనిషి అవివేకమో లేదా అజ్ఞానం తప్ప మరోటి కాదు.
ఎక్కడ భగవంతుడు? ఎక్కడ మానవుడు? ఆయన సకల సృష్టికర్త. చీమ నుండి బ్రహ్మాండంవరకు ఆయనచే సృష్టించబడినవే కదా. అణువునుండి ఆకాశంవరకు అన్నిటా అంతటా ఆయన వ్యాపించి వుంటాడు. కోరికల వ్యామోహంలో చిక్కుకున్నవారికి విచక్షణా జ్ఞానం వుండదు. ఒకవేళ వున్నా అది నశిస్తుంది. వారికి తెల్సిందల్లా ఆ కోరికని ఎలాగైనా తీర్చుకోవడమే. అందుకనే ఆ కోరికలు నిండిన మనసుతో నేరుగా భగవంతుడితోమాట్లాడుతారు. దేవుడితో మొక్కుల గురించి ఏకరువు పెడతారు.
కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడు గీతో పదేశం చేస్తూ అర్జునుడితో కర్మ చేయడానికే నీకు అధికారం కలదు. కానీ కర్మ ఫలం మీద నీకు అధికారం లేదు. ప్రతిఫలాపేక్షతో సకర్మను ఆచరించకు. అలాగని ఆ కర్మలను మానకు. అని ఇంత చక్కని, ఇంత స్పష్టంగా పరమాత్ముడు ఉపదేశం చేశాడు కదా. మరి అది తెలుసుకొని కూడా మొక్కులు మొక్కుతున్నాం అంటే అది ఇంకా మనలో అజ్ఞానం ఉన్నట్టే కదా. ? ఇంకా జ్ఞానం కలుగకపోతే ఎలా? కానుకలతో వస్తు వైభవాలతో మనుషులను ఆకర్షించుకొనవచ్చు. కానీ ఆయన పరమోన్నతుడూ, పరమాత్ముడు. ఆయన్ని ఏ కానుకలు, ఇతర వైభవాలు ఆకర్షించలేవు ఒక నిండైన భక్తి తప్ప. స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో చేసే ప్రార్థనే ఆయనను చేరుతుంది. పశుపక్ష్యాదులతో, తోటిమానవులతో, ప్రకృతిలో అన్నిటా అంతటా ఆయన నిండి వున్నాడనే నమ్మకం పెంచుకోవాలి. అన్నిటిని ప్రేమించాలి. అందరిని ప్రేమించాలి. మనసులో శాంతిని నింపుకోవాలి. ఎక్కడైతే శాంతి, ప్రేమలు వుంటాయో అక్కడ కచ్చితంగా భగవంతుడు వుంటాడు. నిజమైన భక్తికి నిదర్శనం పరిపూర్ణమైన భక్తి మాత్రమే.

- వాణి ప్రభాకరి