Others

స్వచ్ఛమైన భగవంతుని కృపయే సత్యము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుందరము విశాలమగు పృథివిని పాలించిన రాజులు అహంకార శూన్యులై వచ్చి నీవు శయనించు మంచం కింద గుంపులు గుంపులుగా చేరారు. చిరుగంట ముఖం వలె సగం విడి సగం విడక తామర పూవువోలే నీ ఎర్రని నేత్రాలనుంచి వచ్చే కాంతిని మాపై ప్రసరింపచేయవా స్వామీ !
ఆకాశంలో వెలిగే సూర్యచంద్రాదులవలె మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే నీ నేత్రాల కాంతిని మాపై పడితే నీ వియోగం తీరిపోతుందని గోపికలు చెబుతున్నారంటే దానిలోని పరమార్థం ఏమంటే అహంకారం విడిచి అభిమానం దూరం చేసుకొని వచ్చారంటే దేహాత్మాభిమానం తొలగిపోయినట్లు, అనర్యార్హశేషత్వం అనన్య శరణ్యత్వజ్ఞానం కలుగుట అని అర్థం. దేహామే ఆత్మ , నేను స్వతంత్రుడను, నా రక్షణ నేనే చూసుకోగలను, నేను ఇతరులకు శేషభూతుడను, అభాస బంధువులందు బంధుత్వ బుద్ధి , విషయములందు భోగ్య బుద్ధి ఈ ఆరు కూడా భ్రాంతులే సుమా. వీటిని వదలాలి. ఆ భ్రాంతులను దూరంచేసుకొంటె తప్పక భగవంతుని కృప అనే కాంతి మనపై ప్రసరిస్తుందన్నమాట. నేడు కోవెలలో తిరుప్పావై పాశురాలను అనుసంధానించడానికి గోదారంగనాథుల కల్యాణ వేడుకలను తిలకించడానికి అందులో పాల్గొన డానికి వెళ్లే భగవత్ బంధువుల్లారా ఈ జగత్‌లో కనిపించేవన్నీ నిమిత్తమాత్రములే. అవన్నీ ఎంత గొప్పగా కనిపించిననూ అంతా మిధ్యనే.కనుక జగత్‌ను అంటే విషయవస్తువులను వదిలి అందు లోని దినుసు అంటే జగన్నాథుని కొలువుము. ఆజగన్నాథుడే నిత్యుడు సత్యుడు సుమా.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899