Others

విశ్వమానవుడు వివేకానందుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి 1985ను అంతర్జాతీయ యువ సంవత్సరంగా ప్రకటించింది. తదనుగుణంగా భారత ప్రభుత్వం జనవరి 12, 1985ను భారత జాతీయ యువదినోత్సవంగా ప్రకటించింది. ఆనాటినుండి జనవరి 12న జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
వేదకాలపు భూమి మనది. గీతజ్ఞానపు నేల మనది. యుగయుగాలుగా మహాపురుషులు అవతరించిన అవని మనది. అలాంటి అవతారమూర్తి, చైతన్యస్ఫూర్తి, ఆధ్యాత్మికజ్యోతి, వేదాంతవేత్త, తత్వవేత్త, మహావక్త, ప్రవక్త, మహాదేశభక్త జగద్గురువు, కదిలే భారతదేశం, కరిగే హిమశిఖరం, దూకే జలపాతం, జ్ఞాన గంగా ప్రవాహం, నవయుగ వైతాళికుడు, ఈ యుగపురుషుడు స్వామి వివేకానంద. గౌతమబుద్ధుడి హృదయం, ఆదిశంకరుని మేధస్సు కలబోసుకున్న దివ్య మంగళ స్వరూపం స్వామి వివేకానంద.
1863 జనవరి 12న భువనేశ్వరి, విశ్వనాథ దత్త పుణ్య దంపతులకు కాశీ విశే్వశ్వర వరప్రసాదంగా కలకత్తా నగరంలో మకర సంక్రాంతి పర్వదినం రోజు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్రుడు చిన్నప్పటినుండి అద్భుతమైన తెలివితేటలు, అసాధారణ ప్రతిభా పాటవాలు, అసమాన ధైర్యసాహసాలు, అద్భుతమైన జ్ఞాపకశక్తి, శాస్ర్తియ దృక్పథం, సహేతుకమైన ఆలోచనలతో, ఆటలలో, పాటలలో, చదువులో అన్నింటా ముందుండేవాడు. దేవుడున్నాడా లేడా? వుంటే ఎవరైనా దేవున్ని చూసారా? అన్న ఆసక్తి తనకు చిన్నప్పటినుండి వున్నది. ఆ కోరిక పెరిగేకొద్దీ బలపడింది. తన సందేహాలను ఎవరూ తీర్చలేకపోయారు. తన 18వ ఏట 1881లో రామకృష్ణ పరమహంసను కలిసినపుడు అన అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. జన్మజన్మల బంధంగా వారిమధ్య గురుశిష్య సంబంధం పెనవేసుకుపోయింది. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నరేంద్రుడు వివేకానందుడిగా నామకరణం పొందారు. గురువు ఇచ్చిన ప్రేరణతో వివేకానందుడు భారతదేశం మొత్తం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పర్యిటించారు. బ్రిటీష్ కబంధ హస్తాలలో నలిగిపోతూ నిర్వీర్యంగా, నిస్తేజంగా మారి దుర్భర జీవితాలు గడుపుతున్న భారతీయుల దీనావస్తను చూసి చలించిపోయారు. ఒకప్పుడు రత్నగర్భగా, జగద్గురువుగా భాసిల్లిన భారతదేశానికి ఎందుకు ఈ దుస్థితి? ఏమిటి దీనికి పరిష్కారం అని బాధపడ్డాడు. కన్యాకుమారిలోని సముద్రంలోపల శిలపై ఈదుకుంటూ వెళ్లి 1892 డిసెంబర్ 25, 26, 27 మూడు రోజులపాటు తపస్సు చేసి తన కర్తవ్యాన్ని, జీవిత కార్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు. అభివృద్ధి చెందిన అమెరికా పాశ్చాత్య దేశాలకు భారతీయ విశ్వజనీన విలువలను, సంస్కృతి సంప్రాదయాల గొప్పతనాన్ని సనాతన వేదాంత రహస్యాలను తెలియపరచడం ద్వారా భారతజాతిలో స్వాభిమానాన్ని రగిలించి చైతన్యం కలిగించి జాతిని జాగృతపరచాలని భావించి చికాగోలో జరిగే సర్వమత సదస్సుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సముద్ర మార్గంలో 1893 మే 31 రోజు అమెరికా బయలుదేరి వెళ్ళారు.
చికాగో చిద్విలాసం
సర్వసమత సదస్సు ప్రపంచ చరిత్రలో మరపురాని మహాద్భుతం జరిగిన రోజు. మనిషి మాటకున్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. ప్రపంచం నలుమూలలనుండి వచ్చిన తలలు పండిన దాదాపు ఆరువేలమంది మేధావుల ముందు కేవలం 30 సంవత్సరాల ఒక యువకుడు మాట్లాడిన మాటలు 136 సంవత్సరాలు గడిచినా నేటికీ అవి ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అంతకుముందు స్వామీజీ సభలో మాట్లాడిన అనుభవం లేదు. అంతకుముందు మాట్లాడిన వక్తలందరూ తమ తమ గొప్పలు చెప్పుకున్నవారే. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సర్వమత గమ్య ప్రేమ సిద్ధాంతాన్ని చెప్పినవారు లేరు. చిట్టచివరి వక్తగా స్వామీజీని ఆహ్వానించారు. అమెరికా సోదరీ సోదరులారా అన్న మొదటి మాటకే ఆ సర్వమత సభ కరతాళధ్వనులతో ప్రతిస్పందించింది.
చికాగో స్వామీజీ ఉపన్యాసం
అమెరికా సోదరీ సోదరులారా! మీరు చూపిన ఆదరాభిమానాలకు, అతిథి సత్కారాలకు నా హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. మతాలకు తల్లిలాంటి సనాతన ధర్మప్రతినిధిగా, భిన్న వర్గాలు, తెగలకు చెందిన కోట్లాది హిందువుల ప్రతినిధిగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మేము అన్ని మతాలు సత్యమని నమ్ముతాము. దారులు వేరైనా అన్ని మతాలు సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మ గురించే ప్రబోధిస్తున్నాయి. నేను చిన్నప్పటినుంచి వింటున్నది, కోట్లాది భారతీయులు ప్రతినిత్యం ధ్యానం చేసే ఒక శ్లోకం- ‘యే యధామాం ప్రపద్యంతె తాం స్తదైవ బజమ్యహం / మనువర్త్మా నువర్తనే్త ముష్యః పార్థసర్వశః’- ప్రపంచం అత్యంత ప్రాచీన ఋషిమణి పరంపరకు ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ప్రెంచి, డచ్చి, పార్సి, పోర్చుగీసు, యువనులు, యూదులు, ఇజ్రాయిలీలు మొదలైన ఎందరో శరణార్థులకు ఆశ్రయమిచ్చి అండగా వున్న జాతి మాది. గతంలో ఈ పవిత్ర భూమి హింస, ద్వేషం, స్వార్థం, మతోన్మాదం కారణంగా రక్తసిక్తంతో తడిసింది. మనిషిలోని స్వార్థం, రాజ్యకాంక్ష, సభ్యత, సంస్కృతి, నాగరికతలను ధ్వంసం చేసిన మానవ సమాజాన్ని నిరాశా నిస్పృహలకు గురిచేసింది. అలా జరుగకుండా వున్నట్లయితే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది వుండేది. హింస, దౌర్జన్యం, మతోన్మాదాలకు కాలం చెల్లింది. స్వార్థ సంకుచిత భావాలను పక్కన పెట్టి జాతి, మత భేదాలు వదిలిపెట్టి మానవత్వాన్ని పంచుదాం. కత్తితోగాని, కలంతోగాని చేసే హింసా దౌర్జన్యాలకు స్వస్తిపలికి విశ్వమానవ కల్యాణానికై అందరం పాటుపడదాం అని స్వామీజీ అనర్గళంగా మాట్లాడారు. మరుసటి రోజు అమెరికా పత్రికలు స్వామీజీని ఆకాశానికి ఎత్తి కొనియాడాయి. తరువాత స్వామీజీ విఐపి సెలబ్రిటీ అయ్యారు.
అవ్యాజమైన, అనిర్వచనీయమైన హృదయాంతరాళంనుండి ఉప్పొంగిన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు వివేకానందుడు. అక్కడినుండి స్వామీజీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. ఆయన మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. శాంతి, సహనం, సత్యం, త్యాగం, వసుదైక కుటుంబం అనే భారతీయ సనాతన విశాల దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.
అమెరికాలో వేదాంత సొసైటీ (రాజయోగ)ని స్థాపించి మూడు సంవత్సరాలు నిర్విరామంగా తన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతలూగించి సనాతన విప్లవాన్ని సృష్టించాడు. హార్వర్డ్, కొలంబో యూనివర్సిటీలు, జమ్షట్జి, టాటా లాంటివారు స్వామీజీని వారి సంస్థలలో పనిచేయమని ప్రాధేయపడినా తృణీకరించారు. అమరికా, లండన్ లాంటి యూరప్ దేశాలలో స్వామీజీ చేసిన ప్రసంగాలకు ప్రభావితమై వేలాదిమంది శిష్యులుగా మారారు.
దేశభక్తి
వివేకానందుని మించిన దేశభక్తుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అమెరికాలోని విలాసవంతమైన ప్రజల మధ్య వుంటూ కూడా స్వామీజీ మాత్రం భారతీయుల దీనావస్థను తలచుకుని తల్లడిల్లిపోయేవాడు. తనకోసం ఏనాడూ ఆలోచించలేదు. తన ఉచ్చ్వాశ నిశ్వాస భారతీయతే. తల్లికి దూరమైన బిడ్డలా ఎప్పుడెప్పుడు తిరిగి భారతదేశానికి వస్తానా ఆని ఆరాటపడ్డాడు. విశ్వమత విజేతగా నీరాజనాలు అందుకొని, ప్రపంచవ్యాప్తంగా సనాతన ఢంకా మ్రోగించి 1896లో భారతదేశానికి తిరిగి వచ్చిన స్వామీజీకి జాతి యావత్తూ బ్రహ్మాండమైన స్వాగతం పలికి బహ్మరథం పట్టారు.
దేశ వ్యాప్తంగా పర్యిటించి జాతిని జాగృతపరిచే అనేక ప్రసంగాలు చేశారు. 1898లో బేలూరు మఠాన్ని ప్రారంభించారు. రామకృష్ణ మిషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తన గురుభక్తిని చాటుకున్నారు. తన పేరునుగాని తన తల్లిదండ్రుల పేరుగాని కోరుకోకుండా తన యశస్సును, కీర్తిని రామకృష్ణ పరమహంస పాదాల చెంత సమర్పించిన శిష్యచూడామణి స్వామి వివేకానంద. స్వామీజీ ఇచ్చిన ప్రేరణ భారతీయ యువతలో దేశభక్తిని ప్రేరేపించి, స్వాభిమానం రగిలించి వారిని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనటట్లు చేసింది.
యువతకు సందేశం
స్వామీజీకి యువతపై అచంచల విశ్వాసం. అణుశక్తికన్నా గొప్పది యువశక్తి. ఆయన ఆశలన్నీ యువతపైనే. అందుకేనేమో ఆయన యువతకోసం జీవించాడు, యువతకోసమే ప్రబోధించాడు. యువకుడుగానే పరమపదించారు. ప్రతి వ్యక్తి పరమ పవిత్రుడు. అమృతస్య పుత్రః అంటారు. అనంత శక్తి సామర్థ్యాలు పరిపూర్ణ విజ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. నీ భవిష్యత్ సృష్టికర్తవు నీవే. నీవు అనుకుంటే ఏదైనా సాధించగలవు. గొప్ప కార్యాలు చేయడానికే నీవు పుట్టావు. యువత ఉన్నతమైన ఆదర్శాలను పాటించాలి. క్షమ, దయ, సత్యం, శాంతి, అహింస, సేవా, త్యాగం లాంటి భారతీయ మూలాలను యువత ఆదర్శంగా గ్రహించాలి. ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని పడవలాంటిది. ఏదో ఒక ఆదర్శాన్ని స్వీకరించు, దానికోసమేతపించు, దానికోసమే జీవించు, నీ ఉచ్ఛ్వాశ నిశ్వాస అదే కావాలి. నీ శరీరంలోని ప్రతి కణం దానితో నిండాలి. అప్పుడే దాన్ని నీవు సాధిస్తావు. ఇదే విజయ రహస్యం. లెండి, మేల్కొనండి, మీ గమ్యం చేరేవరకు విశ్రమించండి.

-ఎర్రబైరు సురేందర్‌రెడ్డి 8309444697