Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మానవత్వం మరిచియు దానవులుగఁ
గృంరమైనట్టి కృత్యాలఁగువలయమునుఁ
బట్టి కుదిపెడి వారెల?్భరతమాత
గర్భమున ఁ జెడఁ బుడితిరే కర్కశులుగఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: కర్మసాక్షివైన ఓసూర్యదేవా!మానవత్వాన్ని మంటకలిపి రాక్షసులుగా క్రూర కృత్యాలతో ఈ భూమండలాన్ని ఎంతోమంది పట్టి కుదిపేస్తున్నారు స్వామీ. పాషాణ హృదయులై ఈ భరతమాత గర్భాన అలాంటివారు చెడబుట్టారు ప్రభూ!
తే.గీ. గుణ సమూహాల వెన్నియో కొలువుదీరఁ
బ్రజల యిక్కట్లఁబాపుచు లక్షణముగ
సుపరిపాలనఁజేయుచు శోభఁ గూర్ప
వలయు నాయకమణులంత భరతభూమిఁ
జూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!

భావం: సుగుణాల పుట్టలను కలిగియుండి ప్రజల కష్టాలు తొలగిస్తూ చక్కగా పరిపాలన కొనసాగిస్తూమన నాయకమంలంతా ఈ భరతభూమియందుశోభలను గూర్చిపెట్టాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవు ప్రబోధించుము స్వామి.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262