Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. దేహి దేహుల సేవలోఁ దనివిఁ దీరి
దేహాయాత్రను ఁ జాలింప దేశమాత
హర్షపులకితురాలగు నతిశయముగఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనిషనేవాడు పరుల సేవలో ఎంతో తృప్తిచెంతూ చివరికి దేహయాత్ర చాలించాలి. అపుడే దేశమాత ఎంతగానో హర్షపులకాంకితురాలవుతుందనే సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియజేయు స్వామీ సూర్యనారాయణ మూర్తీ!

తే.గీ. మనసునందున శాంతితో మసలినట్టి
దినము పండుగ దినవౌనుదేహులకును
నిత్యపర్వాలతోఁ జేరు నిధులు గనగఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనసులో శాంతిని నెలకొల్పుకొని నడచుకున్న రోజే పండుగ రోజు అవుతుంది. అలాంటి పండుగ రోజులు నిత్యమూ కలిగియున్న పక్షంలో సకల సంపదలు దరిచేరుతాయన్న సత్యాన్ని ఈలోకానికి తెలియజేయుమయ్యా సూర్యనారాయణమూర్తీ,ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262