Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అద్భుతమైన పాఠఆలననుభవములు
నేర్పుచుండును వాటని నీవు విస్మ
రింపఁబోకుము దలుపంగ నించురైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అనుభవాలు అద్భుతములైన పాఠాలు నేర్పుతుంటాయి. అనుభవపాఠాలను నిర్లక్ష్యం చేయరాదు. నిర్లక్ష్యం చేసిన పక్షంలో జీవితమందెన్నో సమస్యలు చుట్టి ముట్టేస్తాయన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓసూర్యదేవా!ఈ లోకానికి తెలియజేయుమయ్యా లోకప్రభూ!

తే.గీ. దొంగదారులు వెదుకంగ దొరికిపోదు
రొక్కనాడు గాకున్న వేరొక్కనాడు
రాచబాటలనుఁ బట్టిన రమ్యమైన
బ్రతుకు లభియించుఁ దెలుచుకోవలయుఁ గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దొంగదారులు వెదికితే ఒకసారి కాకున్నా మరొకసారి దొరికిపోవడం తథ్యం.అదే రాచబాటలో ప్రయాణిస్తే అందమైన బ్రతుకు లభిస్తుందని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262