Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మంచు కరగిన చందాన మనసు కరగ
వలయుఁ బాషాణమై గట్టి పడగవలదు
మనసు మనుజులఁగలుపునీ మహినఁ గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మంచు కరిగిపోయిన విధంగా మనసు కరిగిపోవాలి తప్ప కఠిన శిలగా మారిపోరాదు. కరిగిపోయే తత్త్వం గల మనసు మనుషులందరినీ కలుపుతుందనడంలో సందేహం లేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియచెప్పుమయ్యా దినకరా!
తే.గీ. రంగువాళ్లను గణియించి రతనములను
లెక్కచేయని యజమానులెక్కువా యె
నెచటఁ గాంచిన వారమె నిఖిల జగతి ఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: కృత్రిమమైన రంగురాళ్లను పోలిన కుత్సితులను మాత్రమే పరిగణనలోనికి తీసుకొంటూ రత్నాల వంటి గుణవంతును, సామర్థ్యం గల ఉత్తములను లెక్కచేయకున్నారు. ఈలోకంలో ఎక్కడ చూసినా అటువంటి యజమానులే తారసపడుతున్నారు. కర్మసాక్షివైన ఓసూర్యదేవా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262