Others

విద్యారణ్యుల విజయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయణాచార్యులు వారి శ్రీమతి సనాతన ధర్మాన్ని ఆచరించేవారు. వారికి సాయణులు, మాధవుడు, భోగనాథుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు. వారికి జాతక కర్మలు చేయించారు. కాలానుక్రమంగా శాస్త్భ్య్రాసానికి కూడా శ్రీకారం చుట్టారు. మాయణాచార్యుల దగ్గరకు ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు శాస్త్ధ్య్రాయనానికై వచ్చేవారు. మాయణాచార్యులు ఇటు విద్యార్థులకు ధర్మబోధ చేస్తూనే మరో ప్రక్క దేశంలో ఎక్కడ అధర్మం జరుగుతున్నా ఆ అధర్మాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి దానికి తగిన పథక రచన చేస్తుండేవారు.
అట్లాంటి కాలంలోనే తురుష్కులు మనదేశంపైకి దురాక్రమణలు చేస్తుండేవారు. ఆ తురుష్క ముష్కరులు భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకోవడమే కాక విచక్షణారహితంగా దేవాలయాలను విధ్వంసం చేస్తూ ఉండేవారు. స్ర్తిలు, బాలబాలికలు,వృద్ధులు అనే విచక్షణలేకుండా అందరినీ హింసించేవారు. వారి దుండగాలతో భారతదేశం అతలాకుతలం అయిపోతుండేది. ఎక్కడ చూసినా దుఃఖోద్వేగం ప్రబలంగా వినిపిస్తూ ఉండేవి.
ఆ రోజుల్లో దేవాలయాలు చైతన్యకేంద్రాలుగా ఉండేవి. అన్నార్తులకు అన్నాన్ని, అనాథలకు ఆశ్రయాన్ని కల్పించే గృహాలుగా ఉండేవి. నాట్యం, గానం లాంటి కళారాధకులకు వారి కళలను ప్రదర్శించే రంగస్థలాలుగా ఉండేవి. దేవాలయాల్లోపారాయణలు, ప్రవచనాలు, హరికథలు, భజనలు ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలల్లో భక్త్భివాన్ని నింపుతూ ఉండేవి. వారిలో ఐకమత్యాన్ని ప్రోది చేసేవి. వారిలో సంఘటిత శక్తిని నూరిపోసేవి. సమాజంలో ఉండే తారతమ్యాలనేవి కేవలం వృత్తిరీత్యా మాత్రమే కానీ మనుష్యుల మధ్య భేదాలు లేవనే సత్యాన్ని ప్రతివారిలో మొలకెత్తింపచేసేవి.
భక్తుల కథలను నాటకాల రూపంలో ప్రదర్శింపచేసి వారిలో చెడుగుణాల వల్ల కలిగే దుష్ప్రరిమాణాలను వారికి కళ్లకు కట్టినట్టు చేసి వారిని చెడుగుణాలకు దూరంగా ఉండేటట్టు చేసేవారు. వేదవిద్యాభ్యాసం చేయడానికి కావలసిన వసతులు కల్పించేవారు. ఇవన్నీ చేస్తూ దేవాలయాలు సమాజానికి ముఖ్యమైన ఆలంబన వ్యవస్థలుగా ఉండేవి. కొన్ని ప్రదేశాల్లో న్యాయసందేహం కలిగినపుడు వారికి ఆ దేవాలయాల్లోని భగవంతుని రూపమో లేక అర్చకులుగా ఉండే వ్యక్తులో వారికి పరిష్కారం చూపేవారు. ప్రజ్ఞాపాటవం లో స్పర్థకలిగినపుడు, లేక లోభత్వ గుణాల వల్ల ఆస్తిపంపకాల్లో విభేదాలు కలిగినపుడు కూడా దేవాలయాలే న్యాయస్థలాలుగా మారేవి. ప్రజల్లో దైవం అంటే భక్తితో కూడిన భయం ఉండేది. కనుక జనుల్లో దైవీగుణాలు ఎక్కువడానికి దేవాలయాలు దోహదం జేసేవి. క్షణం గూడా నిలవకుండాతిరుగుతూ నిర్జన ప్రదేశాలను తమ ఆవాసాలుగాచేసుకొని తమ జీవితకాలాన్ని ఎక్కువగా తపస్సమాధిలో గడిపే మహాయోగులైన వారు ఈ దేవాలయాల్లో కొన్నాళ్లు నివసించేవారు. వీరు ఆ ప్రాంత ప్రజలకు ధర్మమార్గాన్ని బోధించేవారు. ఇన్ని రకాలుగా సమాజసేవ చేసే దేవాలయ వ్యవస్థను నాశనం చేయడానికి ముష్కరులు ఎన్నో విధాలుగా ప్రయత్నించేవారు.
అట్లాంటి దేవాలయాలకు దోహదం చేసే మాయణాచార్యుల కుమారులు కూడా ముగ్గురూ ధర్మసంస్థాపనలో పాలు పంచుకోవాలని , ధర్మస్వరూపులుగానే ఉండాలని ఆ దంపతులు అనుకొనేవారు. ఆవిధంగానే వారిని పెంచుతూ వచ్చారు.
ఆ కాలంలో శంకరానందులనే గురువు దగ్గరకు సాయణుడిని, మాధవుడిని విద్యాభ్యాసానికి మాయణాచార్యులు పంపించారు. శంకరానందులు కూడా ధర్మసంస్థాపన కోసం అహర్నిశలూ పాటుపడేవారు. వారి దగ్గర ఉన్నపుడు ఈ సోదరులిద్దరూ మరింత దేశం గురించి తెలుసుకొన్నారు. అపుడే గురువుల ఉద్బోధతో లుప్తమై పోతున్న ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి తమవంతు కృషి చేయాలని నిశ్చయించుకున్నారు.
మాధవుడు ధర్మసంస్థాపన చేయాలన్నా, దేశంలో ప్రబలుతున్న ముష్కరులను తరిమి కొట్టాలన్నా స్వయంశక్తితో పాటు దైవ బలం కావాలని ధృఢమనస్కులయ్యారు.
దైవబలం ప్రాప్తించాలంటే తపోభూమినే సరియైన స్థలమని తపస్సే మంచిమార్గమని అనుకున్న మాధవుడు వెంటనే తన గురువైన శంకరానందుల అనుజ్ఞతీసుకున్నారు. అట్లానే మాతాపితరుల అనుమతిని కూడా తీసుకొన్నాడు.
వెంటనే తపోభూమికి తరలివెళ్లాడు ఆ మాధవుడు. తుంగభద్రానదీతీరంలో విరూపాక్ష దేవాలయ సమీపంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడే తన తపస్సును ఆరంభించాడు. రోజులు నెలలుగా, నెలలుగా సంవత్సరాలుగా మారిపోయాయి. మాధవుడు అంకుఠిత దీక్షాపరుడయ్యాడు. ఆయాచితంగా వచ్చే ఆహారాన్ని సైతం వదిలేసి పూర్తిగా దృష్టిని భవానీ దేవి మీద లగ్నం చేశాడు.
కాలమే మహత్తరమైంది కనుక శుభకాలం ఆసన్నమైంది. ధర్మసంస్థాపనకు శ్రీకారం చుట్టాలని సర్వసృష్టికి కారణమైన జగజ్జనని తలచింది. వెంటనే మాధవుని ముందుకు వచ్చింది.
‘నాయనా మాధవా!’ అని చల్లగా పిలిచింది.
ఆ తల్లి చల్లని పలుకుకు దృఢదీక్షాపరుడైన మాధవునిలో చలనం కలిగింది. కళ్లు తెరిచాడు. ఎదురుగా దేదీప్యమానంగా కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో భవానీ మాత దర్శనం. మాటలు రాక చేతులు ఆడక శరీరమంతా ఆనందపులకాంకురాలు పుట్టగా మాటలకు అందని ఆనందపారవశ్యంతో పెదవులు కదిలించాలనుకొంటూ చేతులు జోడించాడు మాధవుడు.
తల్లి తన నిజభక్తుని పారవశ్యాన్ని చూసి చిర్నువ్వుతో మాధవుని తలపై చేయి ఆనించిందా తల్లి.
అంతే అప్పటివరకు నోరు కదిలించలేకపోయినా మాధవుడు
నజానామి పుణ్యం నజానామి తీర్థం నజానామి ముక్తిం
లయం వా కథాచిత్
నజానామి భక్తిం వ్రతం వాపీ మాతః గతిస్త్వం
త్వమేక భవానీ....
.....
ప్రజేశం రమేశం మహేశం, సురేశం దినేశం
నిశీధేశ్వరం వా కదాచిత్
నజానామి ధాన్యాత్ స దాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీం .... అంటూ తల్లిని స్తుతించాడు.
నీ కోరిక ఏమిటో చెప్పమని భవానీ మాత మాధవుని అడిగింది. మాధవుడు ‘అమ్మా నా దేశం అంతా అన్యాక్రాంతం అయిపోతోంది. ఎక్కడ చూసినాఅధర్మం పెచ్చురిల్లుతోంది. నాకు ధర్మాన్ని నిలబెట్టే శక్తిని ఇవ్వమ్మా. దారిద్య్రం తాండవిస్తోంది. ఆ దారిద్య్రలక్ష్మిని పారద్రోలి ఐశ్వర ప్రదాయిని అయిన మహాలక్ష్మిని నాకు ప్రసాదించు అమ్మా! ధర్మమార్గంలో నా ప్రజలను నడిపించే శక్తిని నాకు ప్రసాదించుఅమ్మా ’అని వేడుకున్నాడు. భవానీ మాత చిర్నువ్వుతో ‘మాధవా! నీకు ఈ జన్మలో ఐశ్వర్య లక్ష్మిని ప్రసాదించలేను. నీ పూర్వజన్మకర్మ అడ్డువస్తోంది. మాధవా!’ అని ఆ తల్లి అనగానే-
‘అమ్మానీ దర్శనంతోటే నాకు పురాకృత పాపమంతా భస్మీపటలం అయిపోయి ఉంటుంది. నీ దర్శనం నాకు లభించింది అంటేనే నీకృపవీక్షణాలు నాపై నే కాదు నా దేశం మీద కూడా వర్షిస్తున్నట్లే కానీ నీవు నన్ను శోధిస్తున్నట్టు నాకు తెలుస్తోంది. ఇదిగో తల్లీ ఈ క్షణమే క్షణభంగురమైన ఈ జీవితంలోని గృహస్థాశ్రమం అనే సంసారసాగరంలో ముంచేయడానికి వీలుగా ఉన్న ఈ జంధ్యాన్ని తీసివేస్తున్నాను. ఈ క్షణం నుంచి నేను సన్యసిస్తున్నాను. కనుక నాకు మరో జన్మను సంప్రాప్తమైనట్లే కదా తల్లీ ఇక నీకు నాకు ఐశ్వర్యాన్ని, ధర్మసంస్థాపనార్థం శక్తిని ప్రసాదించడానికి ఏ అడ్డంకులు లేవుకదా’అన్నాడు.
మాధవుని సమయస్ఫూర్తి అతనిలో గాఢంగా ఉన్న ధర్మసంరక్షణార్థదృష్టికి ఆనందమూ ఆశ్చర్యమూ కలిగిన ఆ భవానీమాత ‘నాయనా! మాధవా!నీవు కోరుకున్నప్పుడు నీకు ఐశ్వర్యాన్ని నీవున్న రెండుక్రోసుల దూరం వరకు వర్షింపచేయగలను. దీనిలో అఖండ హిందూ ధర్మసామ్రాజ్యాన్ని నీవు పునఃస్థాపింపచేయగలవు. నీ ఆశయం సిద్ధించుగాక’ అని వరాన్ని ఇచ్చిందా తల్లి.
ఆ మాధవుడే హంపీవిద్యారణ్యులుగా కీర్తిగడించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపచేసిన మహానుభావులు. ఆ విద్యారణ్యులను ఆదర్శంగా, గురువుగా భావించి నేడు కూడా విదేశీనాగరికతకు వ్యామోహపడుతున్న మన యువతను మేల్కొలిపి వారిలో ధర్మజాగరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైంది.

- డా. రాయసం లక్ష్మి