Others

ప్రణతులు ప్రభాకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

34బ్రహ్మ స్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః
అస్తకాలే స్వయం విష్ణుః త్రరుూ మూర్తి దివాకరః22
ప్రపంచాన్ని పాలించు సూర్యనారాయణుని జన్మదినమే రథసప్తమి అందురు. తాను ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, పూష, మున్నగు పనె్నండు పేర్లతో సృష్టిగావించును. సూర్యుడు చంద్ర భాగానదీ తీరంలో తపమొనర్చునుండ ముఖము నుండి బ్రహ్మ , వక్షస్థలం నుండి విష్ణువు నుదుటి భాగమునుండి శివుడు, పాదభాగములనుండి దేవతా గణము ఉద్భవించునట్లు ఐతిహ్యము కలదు.
మహాభారతము ఆదిపర్వంలో శకుంతలోపాఖ్యాన ఘట్టములో వ్యాసమహర్షి 34ఆదిత్య చంద్రావనిలో నలశ్చ2 అనే శ్లోకంలో మానవుల ప్రవర్తన మంచి చెడు సూర్య చంద్రులు గమనించుదురని వివరించెను. మహాభారతా అరణ్య పర్వంలోనే ధర్మరాజు సూర్యోపాసన మొనర్చ అక్షయ పాత్ర పొంది, తన వెంట నున్న బ్రాహ్మణులకు అన్ని దానమొనర్చెనని, ఆదిత్యుని ప్రభావము వివరించబడినది.
మహాభాగవతం. పంచమ స్కంధంలో, బ్రహ్మాండ మధ్యగతుడగు సూర్యుని పరి భ్రమణవలనే ఉత్తరాయణము దక్షిణాయనము, విషువత్తు, ఏర్పడునని, తత్ఫలితంగా యేర్పడుచున్న రాత్రింబవళ్లు , దీర్ఘములుగానూ, హ్రస్వములుగనూ, సమముగను మారుచున్నట్లు వివరించునది. సూర్య రథము ఒక దినం తొమ్మిది కోట్లా యాభై యొక్క లక్షల యోజనమున గల మానసోత్తర పర్వతము చుట్టును నవగ్రసములతో, నక్షత్రములతో పయినించును. పనె్నండు ఆకులు, ఆరుకమ్ములు, మూడు నాభిప్రదేశాలు, ఒక చక్రము గల సంవత్సరాత్మ యైన సూర్యరథం , ఒక మూహూర్తకాలంలో ముప్పై నాల్గులక్ష ల యెనిమిది వందల యోజనముల దూరము ప్రయాణించును. ఒక ఇరుసుకు రెండు వైపుల, మేరు, మానస్తోత్తర పర్వతములు, వాయు పాశాలతో కట్టబడి ఉండును. అది భూమి రెండు ధ్రువాలకు అంటియుండును. సూర్యరధమునకు ముప్పై ఆరులక్షల యోజనముల పొడవుగల గాయత్రి మున్నగు సప్త ఛందస్సులనబడే అశ్వముల మెడకు 3కాడి2కట్టబడి యుండును. ఏకచక్ర రథానికి అరుణుడే రథసారథి. రథాగ్రభాగమున వాలఖిల్యాది అరవైవేలమంది జ్యోతిర్మయి స్వరూపులై వేదసూక్త్ధ్యాయనమొనర్చుచూ వెంబడించుచుండ, మునులు, గంధర్వాదులు, అప్సరోగణములు, గరుడుడు సేవించుచుందురు.
ఈవిధంగా తొమ్మిది కోట్లా, యాభై ఒక్క లక్షల యోజన పరిమాణం దలిగిన భూమండల చుట్టూ సూర్యుడు క్షణానికి రెండు వేలా యాభై యోజనాల దూరం అహోరాత్రములు గ్రహ నక్షత్రరాసులతో సంచరించును. ద్వాదశరాసులలో కర్మసాక్షి ఒక సంవత్సరము సంచురించుట వలననే ఋతువులు, మాస, పక్ష, తిథులు ఏర్పడుచున్నవి. రథసప్తమి నాడు సూర్యోపాసన మొనర్చుచు శిరములై జిల్లేడు ఆకులు ఉంచుకుని స్నానమొనర్చుట హిందూ సంప్రదాయము. అన్ని రాసుల సంచారము పూర్తియనుటయే సంవత్సరమందురు. రామ రావణ యుద్ధంలో అగస్త్య మహర్షి ప్రత్యక్షమై శ్రీరామునకు అత్యంత ప్రభావ సంపన్నమగు ఆదిత్య హృదయ మంత్రమును ఉపదేశించుట వలననే రావణ వధ సమాప్తమయ్యెను. సూర్య రథ సంచారప్రభావం వలననే రాత్రులు- పగలు మానవ చేష్టలను గమనించుచుండునని అనుశాసనిక పర్వంలో రెండవ అశ్వాసనమున గలదు. సూర్యోపాసన , ఆరోగ్య ప్రదాత యగుటచే 34ఆరోగ్యం భాస్కరాదిత్యేతో22 అందురు. పూర్వము మందేహాది రాక్షసులు సూర్యోదయ కాలమున సూర్యుని మ్రింగుచుందురు. బ్రాహ్మణులు సంధ్యోపాసన లో గాయత్రీ సహితముగా అర్ఘ్యపాధ్యాదులు సమర్పించునపుడు వారు నశించుచుందురు. ఆ పరమాత్మను కూడా శత్రుబాధ అనివార్యమైనది.
గీతోపదేశంలో శ్రీకృష్ణపరమాత్మ 10వ అధ్యాయంలో అదితి పనె్నండు మంది సంతానంతో తానేసూర్యుడినని క్షణ, దిన , పక్ష, మాస రూపసమయము తానేని వివరించెను. సవితృడని, హరిదశ్యుడని, సహస్రాంశుడనే పేర్లు సూర్యునివే.
విశ్వకర్మ కొమార్తె సంజ్ఞ ను సూర్యునికిచ్చి వివాహం చేశారు. ఆమె సూర్యుని తేజః ప్రతాపములకు తాళనందున మామ సూర్యుని సానబట్టెనని, ఆ చూర్ణంలో చక్రాయుధ నిర్మాణము గావించెనని మహాభారతమందు వెల్లడించబడింది.
ఉత్తరాయణ కాలం పుణ్య ప్రదమైనది. మరణించిన జీవుల ఆ దేవతల ద్వారా బ్రహ్మసాయుజ్యమునకు గొనిపోవుదురని, దక్షిణాయనమున మరణించినవారు కొంతకాలము స్వర్గశుభములనుభవించి తిరిగి భూమికి చేరుచున్నారని తెలియజేయబడినది. గ్రహానుగ్రహమునకు, ఆరోగ్య సిద్ధికి సూర్యుని ప్రతిదినము ప్రార్థించిన సమస్త శుభములు లభించును.
నమో నమస్సహస్రాంశో
ఆదిత్యాయ నమో నమః

- ఆర్. రామారావు, 9492191350