Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శ్రీనిథుల ఁ గోరెదరు చూడరేబవళ్లు
శ్రీలు సర్వస్వమనియోతురేల? జనులు
శ్రీల మోహానఁబడినంత ఁ జిక్కులొదవుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ కాలంలో అంతా రాత్రింబవళ్లు అంటే అనునిత్యం సంపదల నిధులనే చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఈ జనులల్లో చాలామంది సంపదలే సర్వస్వమనీ భావిస్తున్నారెందుకో కదా. సంపదల మోహాన పడితే ఎనె్నన్నో చిక్కులేర్పడడంతో మిగిలేది దుఃఖమే అని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవే ప్రబోధించాలి ప్రభూ!
తే.గీ. కల్లలాడుచుఁ గపటమ్ము గల్గియుండి
యేమి యును ఁ బట్టకుండిననేల యిట్టి
మనుజ జన్మయు ఁ బుట్టుక మైల పడును
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: అబద్ధాలాడుతూ మోసపూరిత భావాలను కలిగి యుండి ఏ విషయం పట్టించుకోకుండా జీవనం గడిపేసే వారికి ఈ మనుజ జన్మమెందుకు? అలాంటి వారి పుట్టుకే మైలపడిపోతుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవే ప్రబోధించుము స్వామి.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262