Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. నిలుపుకొనవలె మాటను ఁ దలుపఁ దప్ప
కూడదెన్నడు దప్పిన ఁగువలయాన
బ్రతికియుండిన భూదేవి బాధపడును
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఆడిన మాట నిలుపుకోవాలే గానీ, ఎన్నడూ తప్పకూడదు. ఆడినమాట తప్పి బ్రతుకీడ్చే వారిని కూడా మోయాల్సి వస్తుందని భూదేవి ఎంతగానో బాధపడుతుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! మాట తప్పడమంటే మహాపాపానికి ఒడిగట్టడమే నని చెప్పు తండ్రీ!

తే.గీ. దుర్గనుల తోడఁ గలసినఁ దొలగు గౌర
వమ్ము చెడిపోదురే సంశయమ్ము వలదు
సంఘమందున ఖ్యాతియు సన్నగిల్లుఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: దుర్జనులతో సాంగత్యం చేయడం వల్ల మనకున్న గౌరవం కాస్తా తొలగిపోతుంది. పూర్తిగా చెడిపోతాం. సమాజంలో మనకున్న పేరు ప్రఖ్యాతులు తగ్గిపోతాయి. ఇందులో సందేహించవలసిన పని లేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకులకు తెలియజెప్పుము తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262