Others

దివ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోభ, విలాసము, గాంభీర్యము, లాలిత్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, ఔదార్యము, సౌకుమార్యము- అన్నీ ఒక రాశిగా పోస్తే- లలితా పరమేశ్వరీ రూపం. భవ భయ బాధలను తొలగించి, భవాన్ని విభవంగా రూపుదిద్దగల మహాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి.
శ్రీచక్రము, శ్రీవిద్యా మంత్రములు శ్రీదేవీ స్వరూపాలే. శ్రీదేవీ మహాత్మ్యమును శబ్ద రూపంగా, శ్రీవిద్యామంత్రములు వెల్లడి చేస్తాయి. శ్రీవిద్య బ్రహ్మవిద్య. కనుక, శ్రీవిద్య మంత్రం, శ్రీచక్రం యంత్రం, శ్రీసహస్రం అంటే లలితా సహస్రనామం- మంత్రానికీ యంత్రానికి సంబంధించిన ‘తంత్రం’. శ్రీవిద్యలో అక్షరూపంగా వెలుగొందే శక్తి, శ్రీచక్రంలో రేఖాకారంగాను, శ్రీసహస్రంలో- సూక్ష్మరూపంగాను దర్శనమిస్తుంది. ఇదే లలితా పరమేశ్వరీ తత్త్వం.కానీ శ్రీవిద్యను, శ్రీచక్ర అధ్యయనాన్ని అందరూ అర్థం చేసుకొని తల్లి తత్త్వాన్ని ఆకళింపు చేసుకోలేరు కనుక ఆ తల్లిని వివిధ నామాలతో స్తోత్రం చేస్తే ఆ స్తోత్రాల్లోని రహస్యార్థాలు మనిషికి కావల్సిన సంపదను అది భౌతికమైనదైనా, పరానిక సంబంధించిదైనా లభ్యమవుతుందని పెద్దలు లలితాసహస్రనామావళిని కూర్చారు. ఇందులోని ఏ నామం జపించినా, సాధన చేసినా ఆ సాధకునికి లేనిది అంటూ ఏమీ ఉండదు. ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మి శ్రీమాత్రే నమః అని అన్నా ఆ తల్లి కరుణాకటాక్షాలు లభ్యమవుతాయ. లలితాపరమేశ్వరీ ఆరాధన మనిషిలోని పశుత్వాన్ని దూరం చేసి మనిషి ని దివ్యునిగా మారుస్తుంది.

- కె. ఎస్ చంద్రిక